Gayatri college
-
ఘనంగా ఫ్రెషర్స్ డే
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని శ్రీగాయత్రీ, మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలల్లో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినియర్ విద్యార్థులు జూనియర్స్‌కు ఆటపాటలతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమానికి జహీరాబాద్ టౌన్ సీఐ నాగరాజు , ఎస్ఐ రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చదువుతోనే మంచి భవిష్యత్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గాయని స్వరూప, ప్రిన్సిపాల్ బి.శాంతకుమార్, కరస్పాండెంట్ విఠల్, డైరక్టర్లు ఎం.మహేష్, డి. మహేష్, డైరక్టర్లు పి.నాగరాజు, కృష్ణ, అధ్యాపకులు మహేష్, వెంకట్, సాయిబాబా, సరస్వతి, సంగీత, లక్ష్మి, కరుణ, క్రాంతి, కిష్టయ్య, అయూబ్‌ఖాన్, రాజు, సంతోష్ పాల్గొన్నారు. మాస్టర్ మైండ్ కళాశాలలో... పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఎంపీడీఓ రాములు, జహీరాబాద్ టౌన్ సీఐ, ఎస్ఐ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిని చదువును నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథ్, డైరక్టర్లు షీలా రమేష్, డాక్టర్ చంద్రశేఖర్, నారాయణరెడ్డ తదితరులు పాల్గొన్నారు. -
నేడు మాక్ ఎంసెట్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఇంజినీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆధ్వర్యంలో ఆదివారం మాక్ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో వందలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు శ్రీకాకుళం పట్టణ శివారులోని మునసబుపేటలో ఉన్న గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ (గాయత్రి కళాశాల)లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) సంస్థ దీనికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం గురజాడ సంస్థ బస్సుల్ని కూడా ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఉదయం 8 నుంచి 8.20 గంటల మధ్య బస్సు ఉంటుందని పేర్కొంది. పరీక్షా సమయానికి అర్థగంట ముందుగా అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. -
యాసిడ్ బాటిల్ పేలి విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్ : హైదరాబాద్ బాచుపల్లిలోని గాయత్రి కళాశాలలోని స్టోర్ రూమ్ లో ప్రమాదవశాత్తూ యాసిడ్ బాటిల్ పేలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.