
ఉత్సాహంగా ఫ్రెషర్స్ డే
యోగివేమన విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెషర్స్‌డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన ఈ వేడుకలకు వైవీయూ రెక్టార్ ఆచార్య ఎం. ధనుంజయనాయుడు హాజరై సందేశమిచ్చారు.
వైవీయూ:
యోగివేమన విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెషర్స్‌డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన ఈ వేడుకలకు వైవీయూ రెక్టార్ ఆచార్య ఎం. ధనుంజయనాయుడు హాజరై సందేశమిచ్చారు. విద్యార్థులు ర్యాగింగ్ వంటి వాటి జోలికి వెళ్లకుండా చక్కటి స్నేహపూర్వక వాతావరణంలో విద్యనభ్యసించాలని సూచించారు. అనంతరం అధ్యాపకులు డాక్టర్ ఎన్.వెంకట్రామిరెడ్డి, ఎస్.వి.రమణ, ఏటీవీ రెడ్డిలు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థినులు తమ భావాలను వ్యక్తీకరించారు. అనంతరం సైన్స్‌బ్లాక్ ఆవరణలో రెక్టార్, అధ్యాపకులు, విద్యార్థినులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.