
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రముఖ బిజినెస్ స్కూల్ ‘ఐఎండీ’ తాజాగా ప్రకటించిన వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ వెనకపడింది. మొత్తం 63 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 6 మెట్లు తగ్గి 59వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడి, అభివృద్ధి, సంసిద్ధత ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను విడుదలచేయగా.. చైనా (42), రష్యా (47), దక్షిణ ఆఫ్రికా (50)వ స్థానాల్లో నిలిచి, బ్రిక్స్ దేశాల జాబితాలో భారత్‌ను వెనక్కునెట్టాయి.
విద్యపై వ్యయం (ప్రతి విద్యార్థికి) తక్కువగా ఉండడం వంటివి ర్యాంకును గణనీయంగా తగ్గించాయని ఐఎండీ బిజినెస్ స్కూల్ స్విట్జర్లాండ్, సింగపూర్ సీనియర్ ఎకనామిస్ట్ జోస్ కాబల్లెరో వ్యాఖ్యానించారు. జీడీపీతో పాటు శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యం, ఆరోగ్య వ్యవస్థ ప్రభావం కూడా భారత ర్యాంక్ తగ్గడానికి కారణాలుగా నిలిచాయన్నారు. జాబితాలో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో.. డెన్మార్క్(2), స్వీడన్(3), ఆస్ట్రియా (4), లక్సెంబర్గ్ (5) ర్యాంకుల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment