
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లోని అగ్రశ్రేణి మేనేజ్‌మెంట్ కాలేజీల జాబితాతో కూడిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2024లో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సత్తా చాటింది. ప్రపంచ టాప్–100 బి–స్కూల్స్ ర్యాంకుల్లో 78వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఐఐఎం–బెంగళూరు 48వ ర్యాంకుతో టాప్–50లో చోటు సంపాదించగా ఐఐఎం–అహ్మదాబాద్ 53వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 59వ ర్యాంకు సాధించాయి.
గతేడాది విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లోనూ టాప్–100లో ఈ నాలుగే ఉండటం విశేషం. ఇండోర్, ఉదయ్‌పూర్, లక్నో ఐఐఎంలు 150–200 ర్యాంకింగ్స్ మధ్య నిలవగా ఢిల్లీ, గుర్గావ్ ఐఐఎంలు 200–250 ర్యాంకుల మధ్య నిలిచాయి. అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్ తొలి స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment