Bansuri
-
సభలో సుష్మాను గుర్తు చేసిన బన్సూరీ
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి గెలుపొంది, పార్లమెంట్లో కాలుమోపిన బన్సూరీ స్వరాజ్ తన తల్లి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను గుర్తుకు తెచ్చారు. తన తల్లి మాదిరిగానే సంస్కృతంలో పార్లమెంట్ సభ్యత్వం తీసుకున్న ఆమె సుష్మా జ్ఞాపకాలను అందరికీ గుర్తు చేశారు.తాజాగా లోక్‌సభలో ఆమె ప్రసంగిస్తున్నప్పుడు అక్కడున్నవారికి సుష్మా స్వరాజ్ శైలి కనిపించింది. బన్సూరీ తన తల్లి సుష్మా స్వరాజ్ మాదిరిగానే తన అభిప్రాయాలను సభలో బలంగా వినిపించారు. ఆ సమయంలో ఆమె హావభావాలు తల్లి సుష్మ మాదిరిగానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.బన్సూరీ తన తల్లి సుష్మా స్వరాజ్ మాదిరిగానే సభలో ప్రసంగిస్తున్నప్పుడు తన వేలు పైకెత్తి సమస్యలపై ఘాటుగా తన స్పందనను తెలియజేశారు. సోమవారం సభలో ఆమె తీరుతెన్నులు సరిగ్గా సుష్మా స్వరాజ్‌ను పోలివున్నాయని సీనియర్ నేతలు అంటున్నారు. సుష్మా స్వరాజ్ తీరులోనే బన్సూరీ.. గౌరవనీయ స్పీకర్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లలో తొలిసారిగా మాటలు, చేతలు ఒకటిగా ఉండే ప్రభుత్వం వచ్చిందని ఆమె అన్నారు. अध्यक्ष जी.... जब बांसुरी स्वराज ने मां सुषमा स्टाइल में दिया लोकसभा में भाषण, देखिए#loksabha | #bansuriswaraj pic.twitter.com/D993ySEFIg— NDTV India (@ndtvindia) July 1, 2024 -
నాడు సుష్మా.. నేడు బన్సూరి.. 1996 తిరిగొచ్చిందా?
దేశంలో 18వ లోక్‌సభకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశ ఓటింగ్ పూర్తి కాగా, ఇప్పుడు అందరి దృష్టి రెండో దశ ఓటింగ్‌పైనే నిలిచింది. 12 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. అదే సమయంలో పలు లోక్‌సభ సీట్లకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే కోవలో న్యూఢిల్లీ సీటుకు జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా మారింది. సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి బీజేపీ తరపున ఈ సీటు నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె 1996లో తన తల్లి ఎదుర్కొన్న పరిస్థితులనే ఇప్పుడు చూస్తున్నారు.ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఈ స్థానాల్లో ఎవరు గెలుస్తారో వెల్లడికానుంది. ఈసారి బీజేపీ ఢిల్లీ నుంచి పోటీకి అవకాశం కల్పించిన కొత్త వారిలో మాజీ విదేశాంగ మంత్రి , బీజేపీ సీనియర్ మహిళా నేత, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఒకరు. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాలు న్యూఢిల్లీ నియోజకవర్గానికి అనుబంధంగా ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ స్థానానికి చెందిన ఎమ్మెల్యే. న్యాయవాది అయిన సుష్మా స్వరాజ్ తన తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఓ లాయర్‌పై పోటీకి దిగారు. 1996లో దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి సుష్మా స్వరాజ్ బీజేపీ తరపున పోటీకి దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికల రంగంలోకి దూకారు. సుష్మా కుమార్తె బన్సూరి స్వరాజ్ కూడా వృత్తి రీత్యా న్యాయవాది. ఆప్ నుంచి ఎన్నికల బరిలో దిగిన న్యాయవాది సోమనాథ్ భారతితో ఆమె పోరుకు సిద్దమయ్యారు. సుష్మా స్వరాజ్ తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కొన్న పరిస్థితులనే ఇప్పుడు ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్‌కు ఎదురుకావడం యాదృచ్ఛికంగా జరిగింది. మరోవైపు నాడు సుష్మాపై కాంగ్రెస్ తరపున పోటీకి దిగిన కపిల్ సిబల్‌కు అవే మొదటి ఎన్నికలు. ఇప్పుడు బస్సూరి స్వరాజ్‌పై ఆప్ తరపున పోటీ చేస్తున్న సోమనాథ్ భారతికి కూడా ఇవే తొలి లోక్‌సభ ఎన్నికలు కావడం విశేషం. -
‘చిన్నమ్మ’ చివరి కోరిక తీర్చిన కుమార్తె
న్యూఢిల్లీ: దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చివరి కోరికను నెరవేర్చారు ఆమె కుమార్తె బన్సూరి. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేకు, సుష్మ ఇవ్వాల్సిన రూ.1 ఫీజును శుక్రవారం చెల్లించారు బన్సూరి. ఈ సందర్భంగా ‘కుల్‌భూషణ్ జాదవ్ కేసులో వాదించి, గెలిచినందుకు గాను హరీశ్ సాల్వేకు ఇవ్వాల్సిన ఫీజు రూ.1ని ఈ రోజు చెల్లించి నీ చివరి కోరిక నెరవేర్చాను అమ్మ’ అంటూ బన్సూరి ట్విట్ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్ తరఫున హరీశ్ వాదించి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చనిపోవడానికి కేవలం గంట ముందు సుష్మా స్వరాజ్ హరీశ్‌తో మాట్లాడారు. ‘మీరు కేసు గెలిచారు.. మీకివ్వాల్సిన ఫీజు రూ.1 తీసుకెళ్లండి’ అని చెప్పారు అంటూ హరీశ్ గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న బన్సూరి స్వరాజ్, హరీశ్ సాల్వేకు ఆయన ఫీజు చెల్లించారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలుపదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చేలా చేయడంలో హరీశ్ సాల్వే వాదనలు కీలకంగా నిలిచిన సంగతి తెలిసిందే. (చదవండి: వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ) -
సెల్యూట్‌తో కడసారి వీడ్కోలు పలికారు!!
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌కు యావత్ దేశం కన్నీటితో తుది వీడ్కోలు పలికింది. తీవ్ర గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి హఠన్మరణం చెందిన సంగతి తెలిసిందే. నిండైన భారతీయ రూపంతో, తన వాక్పటిమతో ప్రజలను ప్రేమగా హత్తుకొనే నాయకత్వ శైలితో ప్రజలకు ఎంతో చేరువన ఈ చిన్నమ్మకు కన్నీటి నివాళులర్పించేందుకు జనం పోటెత్తారు. ఉదయం ఆమె నివాసంలో, అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుష్మా భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు అనేకమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు నివాళులర్పించారు. ఆమె భౌతికకాయాన్ని అంతిమయాత్రకు తరలించే ముందు.. ఆమె తనయురాలు బాన్సూరి స్వరాజ్, భర్త స్వరాజ్ కౌశల్ తుదిసారి సెల్యూట్ చెప్తూ.. కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర అనంతరం లోధీ రోడ్డులోని శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు జరిగాయి. ఆమె పార్థివ దేహానికి వద్ద భద్రతా బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కుమార్తె బాన్సూరీ స్వరాజ్ చేతుల మీదుగా ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించారు. -
'నా కూతురు బారిస్టర్'
న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంలో చిక్కుకున్న విదేశీ వ్యవహారాల శాఖ సుష్మా స్వరాజ్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. సుష్మ కుటుంబం మొత్తం లలిత్ మోదీ సేవలో తరించిందన్న ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శులు గుప్పిస్తున్నారు. తన కుమార్తెకు ఈశాన్య కోటాలో మెడికల్ సీటు ఇప్పించుకున్నారని వచ్చిన ట్వీటుపై సుష్మ మండిపడ్డారు. 'నా కూతురు బారిస్టర్. ఆక్స్ ఫర్డ్ గ్రాడ్యుయేట్. ఎందుకు అబద్దాలు చెబుతారు' అంటూ సదరు ట్వీటుకు బదులిచ్చారు. సుష్మ ఘాటుగా సమాధానం ఇవ్వడంతో సదరు ట్విటర్ ఖాతాను తొలగించారు. అయితే ఇటువంటి వాటికి స్పందించి సమయం వృధా చేసుకోవద్దని సుష్మ మద్దతుదారులు ఆమెకు సలహా యిచ్చారు. న్యాయవాదిగా పనిచేస్తున్న సుష్మ తనయ బాసురి.. లలిత్ మోదీ పాస్ పోర్టు రద్దు వ్యవహారంలో ఆయన తరపు వాదించినట్టు తెలుస్తోంది. — Sushma Swaraj (@SushmaSwaraj) June 17, 2015