కువైట్‌లో కత్తిపోటుకు గురైన భారత నర్సు | Kerala nurse stabbed in Kuwait | Sakshi
Sakshi News home page

కువైట్‌లో కత్తిపోటుకు గురైన భారత నర్సు

Published Wed, Feb 22 2017 4:54 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

Kerala nurse stabbed in Kuwait

కువైట్‌: కువైట్‌లో భారత నర్సు కత్తిపోటుకు గురైంది. ఆమెను నగరంలోని ఫార్వానియా ఆసుపత్రికి తరలించారు. కేరళ రా‍ష్ట్రం కొట్టాయంకు చెందిన గోపికా షాజీకుమార్‌ అక్కడే అల్‌ జహ్రా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమెపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీట్టర్‌ ద్వారా తెలిపారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కువైట్‌లోని భారత ఎంబసీని ఆదేశించినని, కువైట్‌లో భారతీయుల రక్షణ కోసం భారత ఎంబసీ కృషి చేస్తుందని సుష్మా ట్వీట్‌ చేశారు. గత వారం ఓమన్‌లో డెంటల్‌ క్లినిక్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన షెబిన్‌ జీవా (31) హత్యకు గురైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement