కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, బీజేపీలను ఓడించాలని సీపీఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కడికక్కడే పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయించింది.
38 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన.. త్వరలో మరో జాబితా!
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, బీజేపీలను ఓడించాలని సీపీఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కడికక్కడే పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కమిటీ శుక్రవారమిక్కడ భేటీ అయింది. 38 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, ఎన్నికల సర్దుబాట్లు, పొత్తులు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై చర్చించింది. సీపీఐతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించింది.
38 నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు..
పత్తిక కుమార్ (పాలకొండ), సీదరపు అప్పారావు (సాలూరు), యందవ మన్మధరావు (పార్వతీపురం), సీహెచ్ నర్సింగరావు (గాజువాక), రెడ్డిపల్లి కేఎస్‌వీ కుమార్ (విశాఖ ఈస్ట్), బొట్టా ఈశ్వరమ్మ (విశాఖ వెస్ట్), రొబ్బి భాగ్యలక్ష్మి (విశాఖ నార్త్), పెతకంశెట్టి వెంకట్‌రెడ్డి (విశాఖ సౌత్), ఎస్.రమేష్ (భీమిలి), డేగల అప్పలరాజు (ఎస్ కోట), కిల్లో సురేంద్ర (అరకు), సింగిరెడ్డి అచ్చారావు (రంపచోడవరం), కేతా గోపాలన్ (ఆచంట), తెల్లం రామకృష్ణ (పోలవరం), సీహెచ్ బాబూరావు (విజయవాడ సెంట్రల్), బోయి సత్యబాబు (విజయవాడ వెస్ట్), దోనేపూడి కాశీనాథ్ (విజయవాడ ఈస్ట్), ఎం.ప్రభాకర్ (తిరువూరు), ఆంజనేయులు (మైలవరం), నాగమణి (జగ్గయ్యపేట), కె.కళ్యాణ్ (నందిగామ), జేవీ రాఘవులు (మంగళగిరి), గద్దె చలమయ్య (సత్తెనపల్లి), నక్కా వజ్రాంజలి (వేమూరు), జాలా అంజయ్య (సంతనూతలపాడు), జీవీ కొండారెడ్డి (ఒంగోలు), జొన్నలగడ్డ వెంకమరావు (కోవూరు), మామిళ్లపల్లి మోహన్‌రావు (సర్వేపల్లి), కటికాల వెంకటేశ్వర్లు (వెంకటగిరి), దుగ్గిరాల అన్నపూర్ణమ్మ (సూళ్లూరుపేట), కందారపు మురళి (తిరుపతి), ఒంట్రి వెంకటరమణ (శ్రీకాళహస్తి), దేశాండి అరుణాచలం (సత్యవేడు), ఎంఎ గఫూర్ (కర్నూలు), కుప్పా వెంకటేశ్వర్లు (ఆదోని), విప్పల రాంభూపాల్‌రెడ్డి (అనంతపురం అర్బన్), బోదిరెడ్డి నారాయణ (కడప)