సాక్షి, విజయనగరం రూరల్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. విజయనగరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం కాగా జాతీయ పార్టీలతో పాటు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారం ఆఖరిరోజు కావడంతో బుధవారం ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగితా 9 మంది నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నాటికి నామినేషన్లు ఉపసంహరించుకోనందున బరిలో తొమ్మిది మంది నిలిచారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన ఎన్నికల గుర్తులతో ఎన్నికల సంఘానికి పంపినట్టు తెలిపారు.
వ.సం. | అభ్యర్థులు | పార్టీ | గుర్తు |
1 | కోలగట్ల వీరభద్రస్వామి | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ఫ్యాన్ |
2 |
పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు | టీడీపీ | సైకిల్ |
3 | సతీష్‌కుమార్ సుంకరి | భారత జాతీయ కాంగ్రెస్ | హస్తం |
4 | సుబ్బారావు కుసుమంచి | భారతీయ జనతా పార్టీ | కమలం |
5 | చోడి ఆదినారాయణ | జన జాగృతి పార్టీ | మైక్ |
6 | పాలవలస యశస్వి | జనసేన | గాజుటంబ్లర్ |
7 | రేజేటి స్వర్ణలత | ఇండియా ప్రజాబంధు పార్టీ | బాకా |
8 | మండపాక అప్పలరాము | లోక్ జనశక్తి పార్టీ | కంప్యూటర్ |
9 | భీశెట్టి అప్పారావు బాబ్జీ | ఇండిపెండెంట్ | విజిల్ |
Comments
Please login to add a commentAdd a comment