
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కుయుక్తులపై సినీ నటుడు పోసాని కృష్ణమురళీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా విమర్శలపై ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కులపిచ్చి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. కుల, మతాలకు అతీతంగా వైఎస్సార్ కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదే పదే కుల ప్రస్తావన తీసుకు వచ్చి ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని పోసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎలా అయితే ప్రజల గుండెల్లో దేవుడులా చిరస్థాయిగా నిలిచారో.. అంతేస్థాయిలో వైఎస్ జగన్ కూడా ప్రజలకు సేవ చేస్తూ అందరి హృదయాల్లో నిలిచిపోతారు. ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ స్థానంలోకి తీసుకు వెళతారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment