లేనిది ఉన్నట్టు..టీడీపీ కనికట్టు | tdp magic | Sakshi
Sakshi News home page

లేనిది ఉన్నట్టు..టీడీపీ కనికట్టు

Published Sun, Mar 23 2014 12:50 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

tdp magic

సాక్షి, ఏలూరు:
కాంగ్రెస్ పార్టీ చేతిలో కత్తిలా మారి రాష్ట్ర విభజనకు కారణమైన తెలుగుదేశం పార్టీ తన పాపాన్ని కప్పిపుచ్చుకునేందు కు.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందుకోసం ఆదినుంచీ అలవాటైన గోబెల్స్ ప్రచారాన్ని మరోమారు నిస్సిగ్గుగా ప్రయోగి స్తోంది.
 
ప్రజల విశ్వాసం కోల్పోవడంతో ఎన్నికల్లో ఓట్లు అడిగే ధైర్యం చేయలేకపోతున్న టీడీపీ నేతలు తమ పార్టీకి లేని బలాన్ని ఉన్నట్టుగా అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టారు. తొలినుంచీ కాంగ్రెస్ పార్టీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టీడీపీ నేతలు తమ పార్టీలోకి వస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను చూపించి అన్ని పార్టీల నాయకులు తమ పార్టీలో చేరిపోతున్నారంటూ మౌఖిక ప్రచారం చేరుుస్తున్నారు. ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడని వారిని సైతం రేపోమాపో టీడీపీలో చేరిపోతున్నారంటూ తప్పుడు ప్రచారం చేరుుస్తున్నారు.
 
గోబెల్స్ ప్రచారాన్ని పునాదులుగా చేసుకుని టక్కు టమార గారడీ విద్యలను ప్రదర్శించడం ద్వారా ప్రజలను మోసగించడం అలవాటు చేసుకున్న పార్టీ అధినేత అలాంటి ప్రచారాన్ని ముమ్మరం చేయూలని జిల్లా నేతలకు ఆదేశాలిచ్చారు. దీంతో స్థానిక నేతలు తమకు నియోజకవర్గాల్లో ఏ మాత్రం ఓటింగ్ లేకపోయినప్పటికీ టీడీపీకి ‘బావుందంట కదా’ అనే ప్రచారం చేయిస్తున్నారు. నిజానికి ప్రజల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది, దానిని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడేందుకు ఆ పార్టీ నేతలు కుతంత్రాలు పన్నుతున్నారు.
 
తిమ్మిని బమ్మిని చేస్తూ...
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఓ నాయకుడు పొరుగు జిల్లాలోని ఓ లాడ్జిలో సభ్యసమాజం తలదించుకునే పనిచేస్తూ పోలీసులకు దొరికిపోరుు పరువు పోగొట్టుకున్నాడు. కొన్నిరోజుల  అనంతరం ఆ వ్యక్తిని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దింపుతున్నట్టు నాయకులు ప్రకటించారు. ఆ వ్యక్తికి పార్టీ అభ్యర్థిత్వం కట్టబెడుతున్నందువల్ల ఆ నియోజకవర్గంలో టీడీపీ బాగా బలం పుంజుకుందంటూ ప్రచారం చేరుుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకించి కొందరు వ్యక్తులను నియమించినట్టు సమాచారం.
 
ఓ పార్లమెంటరీ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి కుటుంబంపైనా కొంతకాలం క్రితం ఆరోపణలు వచ్చా రుు. ఆయన కుమారుడు ఓ మహిళను వేధిం చారంటూ కేసు నమోదైంది. దీనిపై పెద్ద రగడ చోటుచేసుకుంది. మరోవైపు పదవులు అనుభవించడం తప్ప ప్రజలకు సేవచేయ డం తెలియని ఆ పెద్దాయనకు చెక్‌పెట్టి సమైక్యాంధ్ర ద్రోహిగా ముద్ర వేయించుకున్న మరో పెద్దాయనను బరిలో దించాలని టీడీపీ భావిస్తోంది.
 
జనం కోసం ఎప్పుడూ ఏమీ చేయని ఆ ఇద్దరు పెద్దమనుషులు ఇప్పుడు పదవి కోసం తిట్టుకుంటున్నారు. వీరిపై క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకతను గోబెల్స్ ప్రచారంతో తొక్కిపెట్టాలని తమ్ముళ్లు చూస్తున్నప్పటికీ కుదరడం లేదు. మరో అసెంబ్లీ నియోజకవర్గంలో జూదరులకు, సెటిల్‌మెంట్లు చేసేవారికి అండగా నిల వటం.. కోడిపందాల్లో పాల్గొనడమే కాకుం డా అధికారులపై చేరుు చేసుకోవడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైతం చాలా గొప్పవాడంటూ ప్రచారం చేరుుస్తున్నారు.
 
ఆయన ఎవరు పిలిచినా వెళతాడని, ప్రతి ఒక్కరి సమస్యల్నీ పట్టించుకుంటారంటూ రంగులు అద్దుతున్నారు. అలాంటి వ్యక్తికి మళ్లీ పదవి వస్తే తమలాం టి వాళ్లు నియోజకవర్గంలో తిరగలేని పరి స్థితి దాపురిస్తుందని సామాన్య ప్రజలు భయపడుతుంటే.. అధికారులు విధులు నిర్వర్తించలేమంటూ గగ్గోలు పెడుతున్నారు. వీలు దొరికినప్పుడల్లా పార్టీ అధినేతకు పాదపూజ చేసే మరో నాయకుడు తాను చాలా గొప్ప వ్యక్తిని అన్నట్టుగా నటిస్తున్నారు. విద్యాసంస్థలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే అపకీర్తిని మూటగట్టుకున్న ఆయన సమైక్యాంధ్ర కోసం తీవ్రంగా పోరాడుతున్నట్టుగా ఫోజులిచ్చారు.
 
ఇప్పుడు ఆ వ్యక్తి చాలా గొప్పవాడంటూ పనిగట్టుకుని ప్రచారం చేరుుస్తున్నారు. పదవిలో ఉన్నంత కాలం ప్రజలను పట్టించుకోని ఓ నాయకుడు తనను మించిన ప్రజాసేవకుడు లేడం టూ ఆ పొరుగు నియోజకవర్గానికి చెందిన నేత ప్రచారం చేరుుంచుకుంటున్నారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నిప్పులు చెరుగుతుంటే ఆయన మాత్రం కాంగ్రెస్ నేతల విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. అభివృద్ధిని పక్కనపెట్టేసి అడపాదడపా అగ్ని ప్రమాద బాధితులను పలకరించి అదే చాలా ఎక్కువ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.
 
వేరేవాళ్లూ వచ్చేస్తున్నారట..
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీలోకి రావడాన్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారుు. వారు రాకతో పార్టీ మూడు ముక్కలైంది. ఈ వాస్తవాల్ని కప్పిపుచ్చుతన్న ఆ పార్టీ జిల్లా నాయకులు అదే తరహాలో చాలామంది నాయకులు తమ పార్టీలో చేరిపోతున్నారనే ప్రచారానికి తెరలేపారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ తమ పార్టీలో చేరబోతున్నారంటూ రెండురోజుల క్రితం టీడీపీ నేతలు కొత్త ప్రచారానికి తెరలేపారు. ఇం దుకోసం కొన్ని బృందాలను నియమించి మరీ ఊరూరా ప్రచారాన్ని ఊదరగొట్టిం చారు.
 
 తద్వారా ప్రజల్ని అయోమయూనికి గురి చేశారు. ఈ విషయం తెలిసి గ్రంధి శ్రీనివాస్ తాను వేరే ఏ పార్టీలోకి వెళ్లేది లేదని, తన ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వీడేది లేదని స్పష్టం చేశారు. అరుునప్పటికీ టీడీపీ నేతలు విష ప్రచారాన్ని మానలేదు. ఇలా ప్రతిచోట టీడీపీ నాయకులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, రాష్ట్ర విభజన విషయంలో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీలోకి వలసలు ఎక్కువయ్యూయంటూ ప్రచారం చేరుుస్తున్నారు. అయితే ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఆల్ ఫ్రీ మంత్రం జపించినా ప్రజలు విశ్వసించకపోవడం టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement