సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా అధ్యక్షుడి రాజీనామాతో పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన జిల్లా తెలుగుదేశం పార్టీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమిం చింది. గోడం నగేష్ రాజీనామాతో ఖాళీ అయి న స్థానాన్ని భర్తీ చేసేలా పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు చేపట్టారు. జిల్లా అధ్యక్షుడి స్థానానికి ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులు అబ్దుల్‌కలాం, అరిగెల నాగేశ్వర్‌రావుతోపాటు, నిర్మల్ ప్రాంత నాయకుడు, జెడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాం సుందర్ పేర్లను పరిశీలిస్తున్నారు. టీ టీడీపీ నేత ల సమావేశం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించగా.. జిల్లాలోని పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఖాళీ అయిన జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయం చర్చకొచ్చింది. అయితే తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ మాదిరిగా జిల్లాను రెండుగా విభజించి తూర్పు, పశ్చిమ జిల్లాలకు వేర్వేరు అధ్యక్షులను నియమించాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని నేతలు భావిస్తున్నారు.
సోయం బాపూరావుకు ‘దేశం’ గాలం
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు సోయం బాపూరావుకు తెలుగుదేశం పార్టీ గాలం వేస్తోం ది. తమ పార్టీలో చేరాలని ఎంపీ రాథోడ్ రమే ష్ బాబూరావుతో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గోండు సామాజికవర్గానికి చెందిన నగేష్ రాజీనామాతో అదే సామాజిక వ ర్గానికి చెందిన నాయకున్ని పార్టీలో చేర్చుకునేం దుకు నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అలాగే బీజేపీ నాయకులు కూడా బాబూరావు తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
‘దేశం’ కసరత్తు
Published Sun, Feb 23 2014 2:42 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement