ఆయనొస్తే రైతుకు కడగండే
తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే రైతులకు ఇబ్బందులు తప్పవని ఎంపీ ఎస్పీవెరైడ్డి అన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు విధానాల కారణంగా వ్యవసాయం పనికిరాని రంగంగా మిగిలిపోవడం ఖాయమన్నారు. బండిఆత్మకూరు మాజీ సర్పంచ్ రాజంరెడ్డి సుజాతమ్మ, ఆమె తనయుడు భారత్ గ్యాస్ నిర్వాహకుడు మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీతోపాటు వైఎస్సార్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు బుడ్డా శేషిరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ 2004 సంవత్సరానికి ముందు చంద్రబాబు హయాంలో ఎదుర్కొన్న కష్టాలను రైతులు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు. శ్రీశైలం జలాశయంలోకి వచ్చే వరదనీటిని కరెంటు ఉత్పత్తి పేరుతో నాగార్జున సాగర్‌కు తరలించి నీటి కొరతకు కారణమయ్యారన్నారు. ఆయన హయాంలో డ్యాంకు పూర్తిస్థాయి(854 అడుగులు) నీటిమట్టం చేరేది కాదన్నా రు.
దీంతో కేసీకెనాల్, ఎస్సార్బీసీ రైతాం గం సాగునీరు అందక దుర్బర పరిస్థితులు ఎదుర్కొన్నారన్నారు. ఆయన అధికారంలోకి వస్తే అదే పరిస్థితి పునరావృతమవుతుందన్నారు. జగన్ ఈ ప్రాంత వాసి కావడంతో సాగునీటికి ఎటువంటి డోకా ఉండదని, దీన్ని దృష్టిలో ఉంచుకు ని వైఎస్సార్‌కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
శిల్పా సోదరులు నాయకులను పక్కదారి పట్టిస్తున్నారు..
శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీలో చేరడమే కాకుండా మిగతా నాయకులను కూడా తమ వెంట తీసుకెళ్లి వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని ఎస్పీవెరైడ్డి విమర్శించారు. డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి నాయకులను ఓడిం చి తగు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనతో పాటు బుడ్డా రాజశేఖర్‌రెడ్డ్డి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చి న వారేని, ఇక్కడి రైతుల కష్ట సుఖాలు తెలిసిన వారం కాబట్టి నిరంతరం అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామ ని హామీ ఇచ్చారు.
శిల్పా చక్రపాణిరెడ్డికి శ్రీశైలం నియోజకవర్గంలో ఇల్లు కూడా లేదని, అలాంటి నాయకుడు ఇక్కడి ప్రజ లకు ఎలా అందుబాటులో ఉంటారో ఆలోచించాలన్నారు. ఎన్నికల నేపథ్యం లో మాయ మాటలు చెబుతూ లబ్ధి పొం దడానికి ప్రయత్నిస్తున్నారని, ఓడిపోతే ఇక ప్రజలకు కనిపించడన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరినవారిలో భద్రారెడ్డి, బుచ్చిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, నాగకృష్ణ, హమాలిబాషా తదితరులున్నారు.