సాక్షి, విజయనగరం గంటస్తంభం: నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. మొత్తం ఆరు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం ఎంపీ స్థానానికి 17 మంది, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలకు 130 మంది నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు పరిశీలన మంగళవారం జరగనుంది. ఇదేరోజు నుంచి 28వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీన జరిగే తొలివిడత పోలింగ్‌కు మార్చి 18న నోటిఫికేషన్ జారీ చేయగా అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరణ జరిగింది. 18 నుంచి 22వ తేదీ వరకు వరుసుగా నామినేషన్లను అధికారులు స్వీకరించారు. 23, 24 తేదీలు సెలవులు కావడంతో ఆఖరి రోజు 25న నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు.
చివరిరోజు రోజు 83 నామినేషన్లు
జిల్లాలో చివరి రోజు ఏకంగా 83 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతకుముందు ఐదురోజులు పాటు 64 నామినేషన్లురాగా ఆఖరి రోజు అంతకుమించి రావడం విశేషం. ఇందులో విజయనగరం ఎంపీ స్థానానికి 10 నామినేషన్లు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వేశారు. కురుపాం నియోజకవర్గానికి 5, పార్వతీపురానికి 6, సాలూరులో 12, బొబ్బిలిలో 7, చీపురుపల్లిలో 7, గజపతినగరంలో 7, నెల్లిమర్లలో 13, విజయనగరంలో 3, శృంగవరపుకోటలో 13 చివరి రోజైన సోమవారం దాఖలయ్యాయి. బొబ్బిలి నుంచి టీడీపీ అభ్యర్థి సుజయ్‌కృష్ణ రంగారావు మాత్రమే నామినేషను వేశారు.
రెండు నియోజకవర్గాల్లో అత్యధికంగా 19మంది
మొత్తంగా చూస్తే విజయనగరం ఎంపీ స్థానానికి 17మంది నామినేషను దాఖలు చేశారు. ఎమ్మెల్యే స్థానాల్లో ఎస్.కోట, నెల్లిమర్లలో 20మంది చొప్పున నామినేషన్లు వేశారు. అత్యల్పంగా పార్వతీపురంలో 10 మంది నామినేషన్లు సమర్పించారు.
నియోజకవర్గాల వారీగా నామినేషన్ల సంఖ్య
నియోజకవర్గం | నామినేషన్లు |
విజయనగరం ఎంపీ | 17 |
కురుపాం | 13 |
పార్వతీపురం | 10 |
సాలూరు | 15 |
బొబ్బిలి | 11 |
చీపురుపల్లి | 15 |
గజపతినగరం | 13 |
నెల్లిమర్ల | 20 |
విజయనగరం | 13 |
శృంగవరపుకోట | 20 |
Comments
Please login to add a commentAdd a comment