
ఓట్ల కోసం రూ. 300 కోట్లు!!
తెలంగాణలో ఉనికి కోసం తెలుగుదేశం పార్టీ పాట్లు
72 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల కోసం పంపిణీ!
30 చోట్ల ఒక్కో స్థానానికి రూ. 5 కోట్ల వరకూ నిధులు
మరో 30 స్థానాల్లో ఉనికి కోసం అదనపు నిధులు
హైదరాబాద్ నుంచే జిల్లాలకు నోట్ల కట్టలు సరఫరా
ముగ్గురు పారిశ్రామికవేత్త ఎంపీలకు బాధ్యతలు
విజయరమణారావు ఎపిసోడ్‌తో మరిన్ని జాగ్రత్తలు
కోసం కోట్లు కుమ్మరించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసి పక్కాగా అమలు చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. క్షేత్ర స్థారుులో బీజేపీ ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. అందుకు బీజేపీ శ్రేణులు నిక్కచ్చిగా తిరస్కరిస్తున్నాయి. వురోవైపు తెలంగాణ ద్రోహుల పార్టీగా వుుద్రపడటంతో.. సొంత పార్టీ శ్రేణులకూ ప్రజల్లోకి వెళ్లడం కష్టవువుతోంది. వుున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో సరిగ్గా నామినేషన్లూ వేయులేని దుస్థితి గవునించిన టీడీపీ ఇక సార్వత్రిక ఎన్నికల్లో ‘ఓటుకు నోటు’ పథకాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పొత్తు కారణంగా బీజేపీకి వదిలేసిన 47 సీట్లు పోగా, పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న 72 సీట్లలో ఏ నియోజకవర్గానికి ఎంత మొత్తం వెచ్చించాలో లెక్కలు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం రాజకీయువర్గాల్లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం.. టీడీపీ పోటీ చేస్తున్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు వెచ్చించేందుకు చంద్రబాబు కోటరీ తయారు చేసిన పక్కా ప్లాన్ ప్రకారం రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు తెలంగాణ జిల్లాల్లోని నియోజకవర్గాలకు అందజేస్తారని సమాచారం.
ఆ మొత్తాన్ని విడతల వారీగా ఆయా నియోజకవర్గాలకు పంపించే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. రెండు రోజుల కిందట పెద్దపల్లి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు వ్యక్తిగత సహాయకుడు రాజమౌళి ఆర్‌టీసీ బస్సులో తరలిస్తుండగా పట్టుకున్న రూ. 90 లక్షలు తొలి విడతలో భాగమేనని చెప్తున్నారు. ఇదే తరహాలోనే వురో ఆర్‌టీసీ బస్సులో మరో రూ. 5 కోట్ల వరకు తరలివెళ్లినట్లు పోలీస్ యంత్రాంగం అనుమానిస్తున్న విషయం తెలిసిందే. పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిఘా వర్గాలు దీనిపై దర్యాప్తు కూడా జరుపుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల కోసం టీడీపీ భారీ ఎత్తున డబ్బులు సేకరించి, పంపిణీ కోసం అసెంబ్లీ సెగ్మెంట్‌లకు తరలిస్తుందన్న సమాచారం కూడా ఈ సంఘటన తరువాతే పూర్తిస్థాయిలో రూఢీ అవుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ కేంద్రంగా పంపిణీ ప్రక్రియ
తెలంగాణలోని పది జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఎంత మేర నిధులు పంపించాలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనకు సన్నిహితులైన ముగ్గురు రాజ్యసభ సభ్యులకు జాబితా ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరో పారిశ్రామిక వేత్తతో కలిసి వీరు ఎన్నికల కోసం నిధులు సిద్ధంగా ఉంచారని సమాచారం. తెలంగాణ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నాయకుడి ద్వారా ముందుగా ఎంపిక చేసిన నియోజకవర్గాలకు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంచులు తరలుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే తొలివిడత పంపిణీ కార్యక్రమం పూర్తికాగా, కొన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు అందలేదని.. వాళ్లు ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు, రాజ్యసభ సభ్యుడికి ఫోన్‌లు చేసి లబోదిబో మంటున్నారని తెలుస్తోంది. ఈ అభ్యర్థులకు రెండో కేటగిరీ కింద నామినేషన్ల ఉపసంహరణల తరువాత ‘మూటలు’ వెళ్లనున్నట్లు సమాచారం.
మూడు కేటగిరీలుగా వర్గీకరించి మరీ...
మొదటి కేటగిరీలోని 30 నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థికి రూ. 5 కోట్ల దాకా అందజేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా పార్లమెంటు నియోజకవర్గం నుంచి కోటీశ్వరుడైన అభ్యర్థి ఉంటే ఆయనతో అదనంగా ఒక్కొక్కరికి రూ. 2 కోట్లు ఇప్పిస్తారనీ పేర్కొన్నాయి. ఈ నియోజకవర్గాల్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ద్వారా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు టీడీపీ గట్టి పోటీ ఇస్తుందన్న సంకేతాలు పంపించాలని, అదృష్టం కలిసొస్తే విజయం సాధించవచ్చని ఆ పార్టీ నేతల ప్రణాళికగా చెప్తున్నారు. ఇక రెండో కేటగిరీలో గుర్తించిన మరో 30 స్థానాలను డబ్బుల పంపిణీ ద్వారా కనీసం గౌరవప్రదమైన ఓట్లతో మూడోస్థానంలో నిలిచే నియోజకవర్గాలుగా గుర్తించారని.. ఇక్కడ రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు వెచ్చించాలనే ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ వాదం అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ, మహబూబ్‌నగర్ వంటి జిల్లాలు ఈ కోవలోకి వస్తాయని చెప్తున్నారు. మిగతా సొమ్మును ఘోరంగా ఓడిపోతామని తెలిసినా పోటీలో నిలిచిన వారికి, బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో రెబెల్స్‌గా బరిలో నిలిచి పోటీ ఇచ్చే నేతలకు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. డబ్బుల పంపిణీ విషయం విజయ రమ ణరావు ఎపిసోడ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించడంతో ఈ ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు తెలిసింది.