సొంత ప్రయోజనాల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు:చిరంజీవి | for their own purposes tdp alliance with bjp | Sakshi
Sakshi News home page

సొంత ప్రయోజనాల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు:చిరంజీవి

Published Thu, Apr 24 2014 3:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

సొంత ప్రయోజనాల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు:చిరంజీవి - Sakshi

సొంత ప్రయోజనాల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు:చిరంజీవి

 చంద్రబాబుది ఆఖరిపోరాటం: చిరంజీవి

 సాక్షి, విశాఖపట్నం : సొంత ప్రయోజనాలను కాపాడుకొనేందుకే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని కేంద్ర మంత్రి, ఏపీ కాంగ్రెస్ ప్రచార సారథి చిరంజీవి చెప్పారు. ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి రాజకీయ జీవితం అయిపోయినట్టేనని,  అందుకే ఎలాగైనా గెలవాలని సాధ్యంకాని హామీలను గుప్పిస్తూ ఆఖరిపోరాటం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిరంజీవి బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు స్వార్థపరుడని చెప్పారు. ఆయన స్వార్థ ప్రయోజనాలకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, దేశ ప్రయోజనాల కోసం కాదని తెలిపారు. బాబు మళ్లీ అధికారంలోకి వస్తే బషీరాబాగ్ ఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు బీసీలు, మహిళలకు ఇచ్చిన డిక్లరేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే ఎక్కువ మంది భూ బకాసురులున్నారని, వారికి అప్పుడు చంద్రబాబు కల్పించిన వెసులుబాటులే తర్వాతివారికి కొనసాగింపుగా మారాయని చెప్పారు. బీజేపీలో ఏకవ్యక్తి పాలన నడుస్తోందని, మోడీది హిట్లర్ తత్వమని చెప్పారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement