
'మహానాడు.. తెలుగుదేశం నేతల పండుగ'
హైదరాబాద్ : మహానాడు తెలుగుదేశం నేతల పండుగ అని ఆపార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ 1983 నుంచి మహానాడును టీడీపీ ఆనవాయితీగా జరుపుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న్టట్లు వర్ల రామయ్య అన్నారు.
కాగా తెలుగుదేశం మహానాడును పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడును మరోసారి ఎన్నుకోవటం వరకే పరిమితం చేయనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్ గండిపేటలో జరగనున్న మహానాడులో పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశాలు లేవని సమాచారం. వచ్చే నెల రెండో తేదీ నుంచి రాష్ట్రం రెండుగా విడిపోనుంది. దీంతో రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది.
అయితే ఈ మహానాడులో రెండు రాష్ట్రాలకు విడివిడిగా అధ్యక్షులను ఎన్నుకోకుండా పార్టీ అధ్యక్షుడి గా చంద్రబాబును మాత్రమే ఎన్నుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి సాధారణ ఎన్నికల సమయంలో ఒక కమిటీని నియమించారు. ప్రస్తుతానికి ఆ కమిటీనే యధాతథంగా కొనసాగించనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారంగా ఉంది.