తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోయాయని.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఒక్కశాతం కూడా లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు జూపల్లి ప్రశ్న
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోయాయని.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఒక్కశాతం కూడా లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. పచ్చి అబద్ధాలు, పూటకోమాటతో పబ్బం గడుపుకోవాలన్న ప్రయత్నమే తప్ప.. బాబుకు బీసీలపై ప్రేమ లేదని పేర్కొన్నారు.
బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాదనే బీసీలను సీఎం చేస్తానంటూ చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒకవేళ ఇక్కడ అవకాశం ఉంటే చంద్రబాబు లేదా లోకేష్ ముందుకొచ్చేవారని చెప్పారు. 1983 నుండి ఇప్పటిదాకా సీఎంగా బీసీని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మరి ఆంధ్రాకు బీసీని సీఎం చేస్తావా? అని జూపల్లి సవాల్ చేశారు.