
కార్యకర్తలకు అందుబాటులో ఉంటా: లోకేష్
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా నారా లోకేష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా లేకుండా అందరు కార్యకర్తలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని లోకేష్ తెలిపారు. కాగా పార్టీ కార్యకర్తల సంక్షేమనిధికి సమన్వయకర్తగా లోకేష్ నియమితుడైన కొద్ది సేపటికే అనేక మంది టిడిపి సీనియర్ నాయకులు బుధవారం తమ విరాళాలను నేరుగా కార్యాలయానికి పంపించటం విశేషం.