బుడాకు ప్రపోజ్ చేసినట్టు బోర్డులతో ఏర్పాటైన రియల్ వెంచర్
సాక్షి, బొబ్బిలి: ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందానన్న సామెత అచ్చంగా టీడీపీ నాయకులకు సరిపోతుంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న రియల్ దందాను ఇక్కడి టీడీపీ నాయకులు అచ్చంగా పాటిస్తున్నారు. ఇటీవలే శ్రీకాకుళానికి సుడా, బొబ్బిలికి బుడా సంస్థలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ ఉత్తర్వులను నిబంధనల ప్రకారం ముందుగా కార్యాలయాలు, కార్యకలాపాలు ప్రారంభించకుండానే రియల్ వ్యాపారం బుడా పేరిట సంతరించుకుంటోంది. బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (బుడా)కు చైర్మన్, వైస్ చైర్మన్‌లను నియమించిన అధికార ప్రభుత్వం దీని ఏర్పాటు వెనుక మతలబును చెప్పకనే చెబుతోంది.
ఏదేని రియల్ ఎస్టేట్ ప్రారంభమయితే దానికి సంబంధించి అనుమతుల కోసం నిర్దిష్ట అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉండాలి. కానీ ఇక్కడ బుడా పేరిట బొబ్బిలిలో ఓ కార్యాలయమూ లేదు... కార్యవర్గమూ పూర్తి స్థాయిలో కాలేదు. అంతే కాదు దీనికి కార్యాలయం ఏర్పాటుకు ఒక్క పైసా బడ్జెట్ కూడా విడుదల చేయలేదు. కానీ బుడాకు ప్రతిపాదించామంటే రూ.కోట్లలో రియల్ బిజినెస్‌ను ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన పలువురు వ్యాపారులు టీడీపీ నాయకులతో కలసి పెద్ద వెంచర్‌ను ప్రారంభించారు.
అంత వరకూ బాగానే ఉంది. కానీ మొట్టమొదటి బుడా ప్రపోజ్‌డ్ అందమైన బ్రోచర్లు వేసి రియల్ వ్యాపారాన్ని ప్రారంభించేశారు. కానీ కొనుగోలు దారులకు ఈ బుడా సంగతి తెలియదు కదా? ఎడాపెడా కొనుగోలుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. అసలే ఎన్నికల వేళ అంటూ రాని బుడాకు అనుమతులకు దరఖాస్తులు చేశామని టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల రియల్ వ్యాపారానికి మాత్రం బుడాను అప్పుడే వినియోగించుకుంటున్నారు. బుడా ప్రపోజ్‌డ్ అంటూ పెద్ద వెంచర్లు వేస్తూ ప్రజలను మస్కా కొడుతున్నారు.
బుడా పరిధిలో 11 మండలాల్లోని 572 గ్రామాలతో పాటు మూడు మున్సిపాలిటీ(బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం)లను విలీనం చేస్తూ జీఓ విడుదల చేశారు. మొత్తంగా 7.52లక్షల జనాభా పరిధిలో బుడా తన సేవలను ప్రారంభించాల్సి ఉంది. దీనికి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తెంటు లకు‡్ష్మనాయుడు, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్లను నియమించారు. ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది. అలాగే కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించి బడ్జెట్ విడుదల చేయకపోవడంతో ఎక్కడిదక్కడే ఉండిపోయింది. దీనికి సంబంధించిన రివాల్వింగ్ ఫండ్ కానీ, డవలప్‌మెంట్ ఫండ్‌కానీ విడుదల చేయలేదు. కానీ బుడా పేరిట అప్పుడే రియల్ వ్యాపారాలు మా త్రం ప్రారంభమయ్యాయి. అర్బన్ డెవలప్‌మెంట్ పనులు ప్రారంభించక పోయినా, కార్యాలయాలు కానరాకపోయినా రియల్ వ్యాపారులకు మాత్రం ఈ బుడా ముందుగానే వినియోగపడుతోంది.
రియల్ బ్రోచర్లు
ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ చిత్రం చూడండి! ఆ.. ఏముంది? ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేసుకుని విక్రయించుకుంటున్నారనుకుంటున్నారా? అంత వరకూ బానే ఉంది. దీనికి సంబంధించి అనుమతులు తీసుకునేందుకు ఏదేని పట్టణాభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి రియల్ ఎస్టేట్‌లకు ఇంకా కార్యకలాపాలు ప్రారంభించని, కార్యాలయమే లేని బుడాకు ప్రతిపాదించామని రియల్ వ్యాపారులు బోర్డులు పెట్టారు. అంతే కాదు. మంచి నగిషీలతో బ్రోచర్లు తయారు చేసి టీడీపీ నాయకుల కనుసన్నల్లో వ్యాపారాలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment