ventures
-
హైదరాబాద్ మియాపూర్ లో భారీ మోసం
-
హైదరాబాద్: బోర్డు తిప్పేసిన మైత్రి ప్రాజెక్ట్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ప్రజలను మోసం చేసిన ఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ రాయల్ లీఫ్, రాయల్ పేరడైజ్, రాయల్ మింట్ పేరుతో మూడు వెంచర్లు వేసి 300 మంది దగ్గర సుమారు 50 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. మైత్రి ప్రాజెక్ట్ ఎండి జానీ భాషా షేక్ గత మూడు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మబ్బి పెడుతూ కాలం గడుపుతున్నాడని బాధ్యతలు తెలిపారు. ఒక్కసారిగా అందరూ అడిగేసరికి రాత్రికి రాత్రి ఫ్యామిలీతో పారిపోయాడని, ఇందుకోసం మూడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పుడు దాకా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. ఇందులో అందరూ మధ్య తరగతి, పేద తరగతి వారే ఉన్నామని దయచేసి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఇందుకు నిరసనగా ఈరోజు మియాపూర్ ఆల్విన్ కాలనీలోని మైత్రి ప్రాజెక్ట్స్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసుల స్పందించి వెంటనే జానీ భాషా షేక్ ను అరెస్టు చేయాలని కోరారు. చదవండి: ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నాకు తోడుగా ఉంటావనుకుంటే.. -
తనఖా స్థలాలకు ‘టెన్’డర్
ఈ చిత్రంలో కనిపిస్తున్న లేఅవుట్ గ్రేటర్ వరంగల్ పెంబర్తి శివారులో దత్తాత్రేయ డెవలపర్స్ సంస్థ వేసింది. 406, 407, 408, 408/బి, 409లతో పాటు సుమారు 26 సర్వేనంబర్లలో 51 ఎకరాల్లో 363 ప్లాట్లు ‘కుడా’అనుమతితో లే అవుట్ చేసి విక్రయించారు. గుడి, బడి, పార్కులు, కమ్యూనిటీ హాల్ తదితర సామాజిక అవసరాల కోసం ఐదెకరాలు (10 శాతం) మార్టిగేజ్ చేశారు. ఎక్కడికక్కడ ప్లాట్లు అమ్ముడు పోయాక.. ఆ ఐదెకరాలను సైతం ప్లాట్లు చేసి అధికారుల సహకారంతో కొనుగోలు చేసిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడిక్కడ ఎకరానికి మూడు నుంచి నాలుగున్నర కోట్లపైనే ఉంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో పార్కులు, ఇతర సామాజిక అవసరాలకు ఉపయోగపడాల్సిన స్థలాలు అక్రమార్కుల పరమవుతున్నాయి. కార్పొరేషన్లు, మున్సి పాలిటీల పరిధిలో ఆయా సంస్థల తనఖాలో ఉండాల్సిన ఖాళీ స్థలాలు కన్పించకుండా పోతున్నాయి. నిబంధనల ప్రకా రం.. లేఅవుట్ ప్లాట్ల విక్రయాల సమయం లో సామాజిక అవసరాలకు కేటాయిస్తున్న 10 శాతం భూములను.. ఆ తర్వాత కొన్నాళ్లకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వాస్తవంగా ఈ స్థలాలను కొనడానికి గానీ, అమ్మడానికి గానీ వీల్లేదు. రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా నిబంధనలు ఒప్పుకోవు. కానీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు మార్టిగేజ్ (తనఖా పెట్టిన) చేసిన ఈ స్థలాలను అధికారులతో కుమ్మక్కైన అక్రమార్కులు అమ్మేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. మరోవైపు మంచి లేఅవుట్ వెంచర్లో ప్లాటు కొనుక్కున్నామన్న సంబరం తీరకముందే పార్కు, బడి, గుడి, కమ్యూనిటీ హాలు వంటి సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కనుమరుగవుతుండటంతో కొనుగోలుదా రులు లబోదిబో మంటున్నారు. ఈ అక్రమ దందా వెనుక కొందరు కీలక అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పాత్రపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనఖా స్థలాలను పరిరక్షించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇదే వరుస రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఈ అక్రమ దందా కొనసాగుతోంది. ప్రస్తుత వనపర్తి జిల్లాలోని పాత లేఅవుట్లలో పది శాతం చొప్పున ఉండాల్సిన స్థలాలు.. కమీషన్లకు కక్కుర్తిపడి అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారుల పరమయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో వెంచర్లో పది శాతం భూమిని లేఅవుట్‌గా చేసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సి ఉండగా.. అది మొక్కుబడిగా సాగుతోంది. నల్లగొండలోని ప్రియదర్శిని కాలనీలో 25 ఏళ్ల క్రితమే మునిసిపాలిటీ అనుమతి తీసుకుని లేఅవుట్ చేశారు. ఇందులో పార్కు కోసం ఉద్దేవించిన స్థలాన్ని 17 సంవత్సరాల క్రితమే కొందరు స్థానికులు ఆక్రమించి ఇళ్లు కట్టేసుకున్నారు. దాదాపు 30 గుంటల స్థలం ఆక్రమణకు గురైనా అప్పటి మునిసిపాలిటీ అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుంది. సూర్యాపేట మున్సిపాలిటీలో 2000 సంవత్సరంలో నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఆంజనపురి కాలనీ, హనుమానగర్లో రెండు వెంచర్లు చేశారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి స్థలం కేటాయించగా హనుమానగర్ స్థలంలో అమృత్ పార్క్, టీ పార్క్ ఏర్పాటు చేశారు. కానీ ఆంజనపురి కాలనీలోని స్థలం మొత్తం అన్యాక్రాంతం అయ్యింది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల్లో కూడా ఈ విధంగా కోట్లాది రూపాయల విలువైన ‘10 శాతం’స్థలాలు అన్యాక్రాంతమైనా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ‘కుడా’లో 249 అక్రమ వెంచర్లు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో 449 వెంచర్లకు అనుమతులు ఇచ్చిన అధికారులు, 249 అక్రమ వెంచర్లను గుర్తించారు. కాగితాలపైన గీతలు గీసి (అక్రమ లే అవుట్), ప్లాట్లు చేసి విక్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ.కోట్లు దండుకున్నారు. రెండు ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు సుమారు 1,780 ఎకరాల్లో ఈ 249 వెంచర్లు ఉన్నాయి. అక్రమ వెంచర్లు కావడంతో వ్యాపారులు సెంటు భూమిని కూడా తనఖా పెట్టలేదు. ఫలితంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ద్వారా రెగ్యులరైజ్ చేసుకునేందుకు రూ.లక్షలు అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అక్రమ లేఅవుట్లు అదనం రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా చేసిన లేఅవుట్లు వీటికి అదనం. తెలంగాణ రాష్ట్రంలో 2019 నవంబర్ నాటికి పట్టణ స్థానిక సంస్థలు మొత్తం 142 ఉన్నాయి. అందులో 13 నగరపాలక సంస్థలు, 128 పురపాలక సంఘాలు కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మరొకటి. వీటి పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వం గతంలో ఎల్ఆర్ఎస్ ప్రకటించింది. 2020 ఆగస్టు 26 లోపు చేసిన లేఅవుట్ ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్‌కు ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్కు దాదాపు 25.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.13 కార్పొరేషన్ల పరిధిలో 4,16,155, మున్సిపాలిటీల్లో 10,60,013, గ్రామ పంచాయతీల్లో మరో 10,83,394 దరఖాస్తులందడం లేఅవుట్ల తీరును స్పష్టం చేస్తోంది. స్థలాల పరిరక్షణకు ప్రహరీలు వరంగల్ మహానగరంలో దాదాపు అన్ని లే అవుట్, పార్కు స్థలాల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. లేఅవుట్ల ద్వారా సంక్రమించిన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా ›ప్రహరీలు నిర్మించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. ‘కుడా’అప్పగించిన మేరకు బల్దియా స్వాధీనంలో ఉన్నాయి. ఏమైనా కబ్జాలు ఉంటే ల్యాండ్ సర్వే ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటాం. – వెంకన్న, సిటీ ప్లానర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణ యత్నాలు అడ్డుకున్న అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో సర్వే నంబర్లు 300 నుంచి 303, 306, 311, 313 నుంచి 315 వరకు ఉన్న దాదాపు 14 ఎకరాల్లో 1990లో అరుణోదయ హౌసింగ్ సొసైటీ పేరుతో హెచ్ఎండీఏ అనుమతితో (ఫైల్ నంబర్ 3030/ఎంపీ2/హెచ్ఎండీఏ/91) లే అవుట్ చేశారు. ఏజీ ఆఫీసు ఉద్యోగులు అప్పట్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. దీనికి అనుబంధంగా మరిన్ని లే అవుట్లు వచ్చి సమతానగర్, సాయిరాంనగర్ కాలనీలుగా (నార్సింగి హైట్స్) కొనసాగుతున్నాయి. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం అప్పట్లో నాలుగు చోట్ల పార్కుల కోసం, మరోచోట సెప్టిక్ ట్యాంక్ కోసం 6,070 గజాల స్థలాన్ని వదిలి నార్సింగి గ్రామ పంచాయితీకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇటీవల ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా అధికారులు అడ్డుకుని ఆక్రమణలను తొలగించారు. -
సర్కారు వారి పాట
సాక్షి, హైదరాబాద్: సర్కారు భూముల అమ్మకానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం సుమారు 4500 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా చోట్ల వందల ఎకరాల్లో అన్యాక్రాంతం కాగా కొన్ని చోట్ల కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి వివాదాలు లేకుండా అందుబాటులో ఉన్న భూమిని అంచనా వేసి లేఅవుట్లు చేసి వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇలాంటి భూమి సుమారు 2000 ఎకరాలకుపైగానే ఉన్నట్లు అంచనా. అందులో ప్రస్తుతంవెయ్యి ఎకరాలను అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేఅవుట్లు వేసి వేలం ద్వారా విక్రయించిన హెచ్ఎండీఏ తాజాగా తన అధీనంలోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. కోకాపేట్లో ఇటీవల ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు కేసులు లేకుండా అన్ని రకాల అనుమతులతో కూడిన భూములను మొదట విక్రయించనున్నారు. రెండుచోట్ల వెంచర్లు.. ప్రభుత్వ భూముల విక్రయంలో భాగంగా తొలుత మోకిల, కుత్బుల్లాపూర్‌లలో ఉన్న సుమారు 190 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేయనున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర అన్ని మౌలిక సదుపాయాలతో రెండు మూడు నెలల్లో ఈ రెండు చోట్ల ప్లాట్లను వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్ల లేఅవుట్లు వేయనున్నారు. ప్రభుత్వ భూములతో పాటు అవసరమైన చోట్ల రైతుల నుంచి కూడా భూములను సేకరించే అవకాశం ఉంది, భారీ లే అవుట్లకు తగినంత భూమి అందుబాటులో లేని చోట్ల రైతుల నుంచి సేకరించనున్నారు. కుత్బుల్లాపూర్‌లో మండలం పరిధిలోని హెచ్ఎంటీ కంపెనీని ఆనుకొని ఉన్న వంద ఎకరాల హెచ్ఎండీఏ భూమిలో సుమారు 10 ఎకరాల వరకు అన్యాక్రాంతం కాగా, మిగతా 90 ఎకరాల భూమి కొద్ది రోజల క్రితమే హెచ్ఎండీఏ చేతికి వచ్చింది. మోకిలలో హెచ్ఎండీఏకు 60 ఎకరాల భూమి ఉండగా, రైతుల నుంచి సేకరించిన మరో 40 ఎకరాలతో కలిపి ఇక్కడ లేఅవుట్ వేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఉప్పల్ భగాయత్, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములపై నిర్వహించిన ఆన్లైన్ వేలానికి రియల్టర్లు, బిల్డర్లు, సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ స్పందనతో మరోసారి హెచ్ఎండీఏ పెద్ద ఎత్తున భూముల బేరానికి దిగింది. ఉప్పల్ భగాయత్‌లో మరో 40 ఎకరాలలో లే అవుట్‌ను సిద్ధం చేస్తున్నారు. త్వరలో ప్లాట్లు చేసి విక్రయించనున్నారు. కరువైన రక్షణ.. హెచ్ఎండీఏ భూములకు పలు చోట్ల రక్షణ కరువైంది. వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జవహర్‌నగర్‌లో సుమారు 2300 ఎకరాల హెచ్ఎండీఏ భూములు ఉన్నాయి. ఇక్కడ చాలా చోట్ల భూములు కబ్జాకు గురయ్యాయి. కొన్ని చోట్ల పేదలు గుడిసెలు వేసుకున్నారు. మియాపూర్‌లోనూ వెయ్యి ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. కబ్జాకోరులు పెద్ద ఎత్తునే స్వాహా చేశారు. జవహర్‌నగర్, మియాపూర్‌లలో రెండు చోట్ల పేదల పేరుతో ఆక్రమించుకొని కొందరు భూబకాసురులు రూ.కోట్లు గడించారు. మరోవైపు పుప్పాలగూడలో 100 ఎకరాలు, ఐడీఏ బొల్లారంలో 120 ఎకరాల చొప్పున హెచ్ఎండీఏ భూములు ఉన్నట్లు అంచనా. ఇవి కాకుండా బుద్వేల్‌లో 60 ఎకరాలు, కోకాపేట్లో 60, కొత్వాల్‌గూడలో 50 ఎకరాలు, తెల్లాపూర్‌లో 300 ఎకరాల వరకు హెచ్ఎండీఏకు చెందిన భూములు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. ఇంకా లెక్కతేలాల్సినవి వేల ఎకరాల్లోనే ఉన్నాయి. -
అక్కడ పిరం.. ఇక్కడ స్థిరం!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరులో స్థిరాస్తి వ్యాపారి ఒకరు అయిదెకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేసేందుకు స్థలాన్ని చూశాడు. భూ యజమానితో ఎకరాకు రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. సరిగా నెల తర్వాత 8 కి.మీ. దూరంలో ఉన్న కడ్తాల్‌లో ఎకరా రూ.4 కోట్ల చొప్పున లే అవుట్ ప్రారంభించాడు. అందేంటి? హెచ్ఎండీఏ పరిధిలో, హైవేకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కాదని.. ఎక్కువ ధర పెట్టి డీటీసీపీలో వెంచర్ వేశారేంటని ప్రశ్నించగా.. హెచ్ఎండీఏ పరిధిలో ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్ల కారణంగా నివాసిత స్థలం తక్కువగా ఉంది. పైగా లే–అవుట్ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూడాలి. ఫీజులూ ఎక్కువే. అదే డీటీసీపీ ఫ్రీ జోన్. చార్జీలు తక్కువే, పర్మిషన్లూ సులువుగా వచ్చేస్తాయని సమాధానమిచ్చాడు. పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాట్లూ త్వరగానే అమ్మకం జరుగుతాయని సెలవిచ్చాడు. .. ఇది ఆ ఒక్క డెవలపర్ అభిప్రాయమే కాదు. చాలా మంది బిల్డర్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రాంతాలలో కాకుండా దగ్గరగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలో వెంచర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హెచ్ఎండీఏలో కంటే డీటీసీపీ ప్రాంతాల్లోని భూముల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆంక్షల్లేవ్.. ఆకాశంలో ధరలు హెచ్ఎండీఏ పరిధిలో చాలా వరకు ప్రాంతాలు ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్లలో ఉంటాయి. ఇక్కడ ప్లాంటింగ్ లేదా నివాస భవనాలకు అనుమతి లేదు కేవలం పరిశ్రమలు, ఇతరత్రా నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. లే– అవుట్, నిర్మాణాలకు పనికొచ్చే రెసిడెన్షియల్ (ఆర్)–1 జోన్ స్థలాలు చాలా తక్కువగా ఉంటాయి. డీటీసీపీలో జోన్ల సమస్య ఉండదు కాబట్టి ఇక్కడ భూముల ధరలు హెచ్ఎండీఏతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ పలుకుతున్నాయని స్పేస్ విజన్ సీఎండీ నర్సింహారెడ్డి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఫీజు చదరపు మీటరుకు రూ.40 చెల్లించాలి. బెటర్మెంట్ చార్జీలు, పార్క్‌లు, ఇతరత్రా లోడ్ల పేరిట ఫీజుల మోత మోగుతుంది. పైగా అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాలి. డీటీసీపీలో గ్రామ పంచాయితీ తీర్మానాన్ని బట్టి ఫీజుల్లో తేడా ఉంటుంది. బెటర్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్, లే అవుట్ ఫీజు (చ.మీ.) గజానికి రూ.5–12 వరకు ఉంటుంది. డీటీసీపీలో రోడ్ల విస్తీర్ణం ఎక్కువే.. లే–అవుట్ విస్తీర్ణంలో 10 శాతం ఓపెన్ ప్లేస్, 30 శాతం రోడ్లకు పోగా మిగిలిన స్థలంలో ప్లాటింగ్ చేసుకోవచ్చు. రహదారుల హద్దులను బట్టి ఎకరం స్థలంలో 55–59 శాతం ప్లాటింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఎకరానికి సుమారుగా 2,600 గజాల నుంచి 2,900 గజాల ప్లాటింగ్ చేసుకోవచ్చు. హెచ్ఎండీఏలో పోలిస్తే డీటీసీపీలో రహదారుల విస్తీర్ణం కాస్త ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎండీఏలో 30 అడుగుల రోడ్లు ఉన్నా అనుమతులు వస్తాయి. అదే డీటీసీపీలో అయితే అంతర్గత రోడ్లు 33 ఫీట్లు ఉండాల్సిందే. ఒకవేళ హెచ్ఎండీఏ పరిధిలో అప్రోచ్ రోడ్ 40 ఫీట్లు ఉంటే ఇంటర్నల్ రోడ్ కూడా 40 ఫీట్లు ఉండాల్సిందే. హెచ్ఎండీఏ, డీటీసీపీ ఏ ప్రాంతంలోనైనా సరే లే–అవుట్‌లోని మొత్తం ప్లాటింగ్ 15 శాతం మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అమ్మకాలు సులువు.. అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలతో పోలిస్తే ఓపెన్ ప్లాట్ల విషయంలో కొనుగోలుదారుల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ధరే కొనుగోలు నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అందుకే చాలా మంది డెవలపర్లు హెచ్ఎండీఏ పరిధిలో అధిక ధర పెట్టి స్థలాన్ని కొని వెంచర్ చేస్తే డెవలపర్‌కు పెద్దగా లాభం ఉండదు. అదే హెచ్ఎండీఏ ప్రాంతం నుంచి 4–5 కి.మీ. దూరంలో ఉన్న డీటీసీపీలో తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి అన్ని రకాల అభివృద్ధి పనులను చేపట్టి ప్లాట్లను చేస్తే సులువుగా అమ్ముడవుతాయి. డెవలపర్‌కూ గిట్టుబాటవుతుంది. ప్రతికూల మార్కెట్ ఉన్న ప్రస్తుత సమయంలో డీటీసీపీలో వెంచర్లు చేయడమే ఉత్తమమని మిర్చి డెవ లపర్స్ ఎండీ మల్లారెడ్డి అన్నారు. (చదవండి: 4 గంటలు.. 3 సర్జరీలు) -
పారిజాత హోమ్స్ నుంచి మూడు ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ నూతనంగా మూడు వెంచర్లను ప్రారంభించింది. ఆదిభట్ల, బాచారం, షామీర్పేట ప్రాంతాలలో రానున్న ఆయా ప్రాజెక్ట్‌ల బ్రోచర్లను ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ, హాలీ లెజెండ్ ముఖేష్ కుమార్ విడుదల చేశారు. ఆదిభట్లలో నిర్మించనున్న పారిజాత ప్రైమ్‌లో 900 ఫ్లాట్లుంటాయి. బాచారంలోని తారామతి ఓఆర్ఓఆర్ ఎగ్జిట్ సమీపంలో కమర్షియల్ స్పేస్‌తో పాటు 390 నివాస గృహాలను కూడా నిర్మిస్తుంది. షామీర్పేటలోని లియోనియో రిసార్ట్ ప్రక్కన 20 ఎకరాలలో పారిజాతా ఐకాన్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. మొత్తం 12 టవర్లలో 1,500 యూనిట్లుంటాయి. అన్ని ప్రాజెక్ట్‌లలో 1,100 చ.అ.లో 2 బీహెచ్‌కే, 1,650 చ.అ.లలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3,500లుగా నిర్ణయించామని’’ చైర్మన్ తాటిపాముల అంజయ్య తెలిపారు. -
ప్లాట్లు కొంటే పాట్లే..!
సాక్షి, యాదాద్రి : జిల్లాలో మున్సిపాలిటీలు, జాతీయ రహదారులు, వైటీడీఏ, హెచ్ఎండీఏ మండలాల్లో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. వందల ఎకరాల సాగు భూములను స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్లుగా మార్చేస్తున్నారు. వీటిని విక్రయిస్తూ మూడు పువ్వులు, ఆరు కాయల్లా సంపాదన చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కళ్లు తెరవడం లేదు. వెరసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. నిబంధనలు పాటించకుండానే.. జిల్లాలో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గత ఏడాది వరకు 726 ఉన్న లేఅవుట్లు ఉండగా ప్రస్తుతం 1000కి చేరాయి. ఇందులో కేవలం 217 వెంచర్లకు మా త్రమే అనుమతులున్నాయి. వాటిలోనూ అనేక లొసుగులున్నాయి. వెంచర్లలో ప్రజాప్రయోజనాల కోసం 10శాతం భూములను సైతం వి డువకుండానే వ్యాపారులు ప్లాట్ల విక్రయాలు జరిపారు. ఎక్కడో ఓ చోట వెంచర్లో 10 శా తం భూమి వదిలినప్పటికీ ఇటీవల రియల్ఎ స్టేట్ వ్యాపారులు మాఫియాగా మారి ఆ స్థలా లను అక్రమ పద్ధతుల ద్వారా అమ్ముకున్నారు. నిబంధనలు పాటించడం లేదు జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల్లో అక్రమ వెంచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వెంచర్ చేసేటప్పుడు నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను వాణిజ్య భూములుగా మార్చాలి. ఇందుకోసం నాలా పన్ను చెల్లించాలి. అనంతరం 10శాతం భూమిని ప్రజా అవసరాల కోసం ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పేరున గిఫ్ట్‌గా రిజిస్ట్రేషన్ చేయాలి. మౌలిక వసతులైన రోడ్లు, మంచి నీరు, విద్యుత్ సౌకర్యం, పార్కులు ఏర్పాటు చే యాలి. గ్రామపంచాయతీల నుంచి ఎన్ఓసీ తీ సుకుని హెచ్ఎండీఏ, వైటీడీఏ, డీటీసీపీ ద్వారా లేఅవుట్‌కు అనుమతి పొందాలి. ఈప్రాథమిక అంశాలేమీ లేకుండానే రైతులకు సంబం ధించిన భూములను కొనుగోలు చేసి హద్దురాళ్లు నాటి క్రయవిక్రయాలు చేస్తున్నారు. కొన్ని సార్లు అధికారులు హద్దురాళ్లు, బోర్డులు తొలగించినా మరుసటి రోజు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. బ్రోచర్లపైనే అందమైన నమూనాలు.. హైదరాబాద్ కేంద్రంగా జిల్లాలోని అక్రమ లేఅవుట్ల ఫ్లాట్ల క్రయవిక్రయ వ్యాపారం సాగుతోంది. యాదాద్రి దేవస్థానం అభివృద్ధి, సమీ కృత కలెక్టర్, గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కు, ఎయి మ్స్, జాతీయ రహదారులు, ఎంఎంటీఎస్ రైలు, భువనగిరి ఖిలా, పోచంపల్లి, కొలనుపాక అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా అందమైన బ్రోచర్లు రూపొందించి ప్లాట్లు అంటడుతున్నారు. ఆదివారం వస్తే జాతరే.. అదివారం వచ్చిందంటే వెంచర్లు జాతరను తలపిస్తాయి. రియల్టర్లు తమ ఏజెంట్లద్వారా హైదరాబాద్ నుంచి కార్లలో కొనుగోలు దారులను తీసుకువచ్చి లేఅవుట్లలో విందులు, వినోదాలు ఏర్పాటు చేసి ప్లాట్ల కొనుగోలుకు ఒప్పిస్తున్నారు. ప్లాట్ మొత్తం ధరలో ఏజెంట్లకు 40శాతం కమీషన్ చెల్లిస్తున్నారు. ఏజెంట్లు అక్రమ లేఅవుట్ల ప్లాట్లను పేద, మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు. అక్రమ వెంచర్లు ఎక్కువగా ఉన్నదిక్కడే.. భువనగిరి మున్సిపాలిటీ, మండలంలో వడాయిగూడెం, వీరవెల్లి, రామచంద్రాపురం, అనంతారం, నందనం, గంగసానిపల్లి, జమ్మాపూర్, తాజ్పూర్, ముత్తిరెడ్డిగూడెం, పగిడిపల్లి, వడపర్తి, నాగిరెడ్డిపల్లి, హన్మాపూర్, ఆర్ఎన్తం డా, బస్వాపూర్, తుక్కాపూర్, చందుపట్ల, పెం చికల్పహాడ్, అనాజిపూర్, బొమ్మాయిపల్లి, చీమలకొండూర్, బాలంపల్లి, కూనూర్, రాయగిరి. బీబీనగర్ మండలం : అన్నంపట్ల, భట్టుగూడెం, బీబీనగర్, బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి, గొల్లగూడెం, గూడూరు, గుర్రాలదండి, జైనపల్లి, కొండమడుగు, లక్ష్మీదేవిగూడెం, మక్తానంతారం, మాదారం, ముగ్ధుంపల్లి, నెమురగోముల, పడమటిసోమారం, పల్లెగూడెం, రాఘవాపూర్, రహీంఖాన్‌గూడెం, రాయరావుపేట, రామునిగుండ్లతండా, రావిపహాడ్, రుద్రవెల్లి, వెంకిర్యాల. భూదాన్‌పోచంపల్లి : మున్సిపాలిటీ, మండలంలోని జలాల్పూర్, పిలాయిపల్లి, దేశ్ముఖి, పెద్దగూడెం, పోచంపల్లి, జగత్పల్లి, జలాల్పూర్. యాదగిరిగుట్ట : మున్సిపాలిటీ పరిధి లోని రామాజీపేట్తో పాటు చిన్నకందుకూర్, చొల్లేరు, దాత్తర్‌పల్లి, జంగంపల్లి, వంగపల్లి, కాచారం, బాహుపేట, పెద్దకందుకూర్,మోటకొండూర్, మల్లాపూర్, సాదువెల్లి, గౌరాయపల్లి, మాసాయిపేట, మహబూబ్‌పేట, సైదాపూర్. ఆలేరు : మున్సిపాలిటీ పరిధిలోని దిలావపూర్, గొలనుకొండ, ఇక్కుర్తి, కొలనుపాక, మంతపురి, మాటూరు, పటేల్‌గూడెం, రాఘవాపురం, శారా జీ పేట, శర్బనాపురం, తూర్పుగూడెం. మోత్కూర్ : మున్సిపాలిటీలో 15వెంచర్లను ఏర్పాటు చేశారు. 5వెంచర్లకు అనుమతులుం డగా 10వెంచర్లకు ఎలాంటి అనుమతులు లేవు. పోలీస్స్టేషన్లకు బాధితులు జిల్లాలో ఏర్పాటు చేసిన అక్రమం లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన Ðవారు పోలీస్ స్టేషన్లకు వెళ్లి పిర్యాదు చేస్తున్నారు. ఈ ఏడాది 100కు పైగా కేసులు నమోదైనట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారుహద్దురాళ్లు తొలగించాం. నెమిలె పంచాయతీ పరిధిలో వెంచర్‌కు డీటీసీ పీ(డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్) అనుమతి లేదు. డీపీఓ,ఈఓపీఆర్డీ ఆదేశాలతో ఇప్ప టికీ 4 సార్లు హద్దురాళ్లు తొలగించాం. –నెమిల పంచాయతీ కార్యదర్శి, రఘుపతిరెడ్డి -
‘రియల్’ మాయ
సాక్షి, కందుకూరు(రంగారెడ్డి) : మండల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. అయినా సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏదో తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి మమ అనిపిస్తున్నారు. వీటిని అదుపు చేయడానికి పటిష్ట ప్రణాళిక చేపట్టకపోవడంతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా అక్రమ వెంచర్లను కట్టడి చేయడానికి హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో మినహా మిగతా వాటిల్లో రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఇటీవల ఆదేశాలు సైతం జారీ చేసింది. ఆ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో మళ్లీ యధావిధిగా అక్రమ వెంచర్ల ఏర్పాటు కొనసాగుతూ మూడు ప్లాట్లు, ఆరు వెంచర్లుగా లాభాలు ఆర్జిస్తున్నారు. జోన్లతో సమస్య.... కందుకూరు మండలం హెచ్ఎండీఏ పరిధిలో ఉండటంతో పాటు అధిక ప్రాంతాలు కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి. దీంతో హెచ్ఎండీఏ నుంచి లేఅవుట్ అనుమతి సాధ్యం కాదు. దీంతో పాత తేదీల్లో అనుమతులు తీసుకుని జీపీ లేఅవుట్లకు తెరలేపారు. రహదారులు, డ్రైనేజ్ ఏర్పాటు చేయకుండా, పార్కు స్థలం వంటివి వదలకుండానే ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరో పక్క ప్రభుత్వం హెచ్ఎండీఏ, డీటీసీపీ మినహా మిగతా లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశాలు జారీచేసినా రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా గతంలో 2015 ఆగస్టు నెల వరకు కటాఫ్ తేదీ నిర్ణయించి ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. ఆ తేదీ ముందు రిజిస్ట్రేషన్లు అయి ఉన్న ప్లాట్లను కొనుగోలు చేస్తే ఏలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత చేసిన వెంచర్లలో కొనుగోలు చేస్తే అక్రమంగానే నిర్ధారిస్తారు అధికారులు. ఫాంల్యాండ్ పేరుతో.... కాగా లేఅవుట్లు చేస్తే అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు రావడం, కూల్చివేతలు చేపట్టడంతో ఫాం ల్యాండ్ పేరుతో కొత్తగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫాంల్యాండ్ లేఅవుట్‌కు ఎవరి నుంచి అనుమతి అవసరం లేకపోవడంతో చాలా గ్రామాల పరిధిలో ప్రస్తుతం ఇవే తరహా లేఅవుట్లు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు రియల్ వ్యాపారులు. ఫాంల్యాండ్ వెంచర్లు ఏర్పాటు చేసినా రహదారులు వంటి వాటిని అభివృద్ధి చేయకూడదు. కాని నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి అందంగా తీర్చిదిద్ది ఫాంల్యాండ్ వెంచర్లలో గుంటలుగా విభజించి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. తూతూ మంత్రంగా కూల్చివేతలు... కాగా హెచ్ఎండీఏ అధికారులు తూతూ మంత్రంగా వచ్చి కూల్చివేతలు చేసి మమ అనిపిస్తున్నారు. పటిష్టంగా మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, హెచ్ఎండీఏ శాఖలు సమన్వయంతో అక్రమ లేఅవుట్లను నివారించాలని పలువురు కోరుతున్నారు. -
అక్రమాలకు నెలవు వెంచర్లు
సాక్షి, చింతపల్లి : నగరాలు, పట్టణాల్లో సాగే స్థిరాస్తి వ్యాపారం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో అనధికారిక వెంచర్లు ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. అయినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. వెంచర్లకు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఫిర్యాదులు అందినప్పుడు అధికారులు నోటీసులతో సరిపెడుతుండడంతో అక్రమ వెంచర్‌దారుల పంట పండుతోంది. హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండలం సుమారు 32 కి.మీ. మేర విస్తరించి ఉంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూముల ధరలకు ఇటీవల రెక్కలొచ్చాయి. భూములు ప్రస్తుతం రూ.లక్షలు పలుకుతుండడంతో అక్రమ వెంచర్లకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అక్రమ వెంచర్లకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొని ప్లాట్లు చేసి ఎక్కువకు అమ్ముతున్నారు. భూమి మార్పిడి రు సుము చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. మండలంలో ఎన్ని వెంచర్లు ఏర్పాటు చేశారు.. ఎన్నింటికి అనుమతులు తీసుకున్నారనే సమాచారం అధికారుల వద్ద లేదు. అధికారుల కళ్లముందే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నా వారు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మండలంలో ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు మండలంలోని మాల్ వెంకటేశ్వరనగర్, గొడుకొండ్ల, పోలేపల్లిరాంనగర్‌తో పాటు మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా అక్రమ వెంచర్లు వెలిశాయి. గొడుకొండ్ల గ్రామానికి వెళ్లే దారిలో కృష్ణా జలాశయం ప్లాంట్ సమీపంలో, కుర్మేడు, గొల్లపల్లి గ్రామాలు, గిరిజనతండాలు, విరాట్‌నగర్, అనబోయినపల్లి, వింజ మూరు, నసర్లపల్లి, తీదేడుతో పాటు మండల కేంద్రంలోని మైస మ్మ దేవాలయం, పోలీస్ స్టేషన్‌కు వెళ్లే దారి తదితర ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు జోరుగా కొనసాగుతున్నాయి. చింతపల్లి మండలం హైదరాబాద్ రాష్ట్ర రహదారికి సమీపంలో ఉండడంతో వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న మాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అయితే వెంచర్లకు డీటీసీపీ అనుమతులు తీసుకోకుండా గ్రామపంచాయతీ అనుమతులతోనే లే–అవుట్ తయారు చేస్తున్నారు. అంతేకాకుండా కొంత మంది పాత సర్పంచ్ల పేరిట అనుమతి పత్రాలను సృష్టిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో లే–అవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ లే–అవుట్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చింతపల్లి మండలంలో అనుమతులు లేకుండా వెంచర్లు చేశారని స్థానికులు ఎంపీడీఓ, జిల్లా కలెక్టర్, తహసీల్దార్, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు అందుకున్న విజిలెన్స్ అధికారులు చింతపల్లి మండలంలో గతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను పరిశీలించి అనుమతులు లేవని తెలిపారు. అనుమతులు లేవని వెంచర్ల వివరాలు సేకరించి నేటికీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ వెంచర్‌దారులకు నోటీసులు జారీ చేశాం గ్రామాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లకు నోటీసులు జారీ చేశాం. మండలంలోని అనుమతులు లేని వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – మమతాబాయి, ఎంపీడీఓ -
బుడా రియల్ బడా
సాక్షి, బొబ్బిలి: ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందానన్న సామెత అచ్చంగా టీడీపీ నాయకులకు సరిపోతుంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న రియల్ దందాను ఇక్కడి టీడీపీ నాయకులు అచ్చంగా పాటిస్తున్నారు. ఇటీవలే శ్రీకాకుళానికి సుడా, బొబ్బిలికి బుడా సంస్థలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ ఉత్తర్వులను నిబంధనల ప్రకారం ముందుగా కార్యాలయాలు, కార్యకలాపాలు ప్రారంభించకుండానే రియల్ వ్యాపారం బుడా పేరిట సంతరించుకుంటోంది. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ (బుడా)కు చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించిన అధికార ప్రభుత్వం దీని ఏర్పాటు వెనుక మతలబును చెప్పకనే చెబుతోంది. ఏదేని రియల్ ఎస్టేట్ ప్రారంభమయితే దానికి సంబంధించి అనుమతుల కోసం నిర్దిష్ట అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉండాలి. కానీ ఇక్కడ బుడా పేరిట బొబ్బిలిలో ఓ కార్యాలయమూ లేదు... కార్యవర్గమూ పూర్తి స్థాయిలో కాలేదు. అంతే కాదు దీనికి కార్యాలయం ఏర్పాటుకు ఒక్క పైసా బడ్జెట్ కూడా విడుదల చేయలేదు. కానీ బుడాకు ప్రతిపాదించామంటే రూ.కోట్లలో రియల్ బిజినెస్‌ను ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన పలువురు వ్యాపారులు టీడీపీ నాయకులతో కలసి పెద్ద వెంచర్‌ను ప్రారంభించారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ మొట్టమొదటి బుడా ప్రపోజ్డ్ అందమైన బ్రోచర్లు వేసి రియల్ వ్యాపారాన్ని ప్రారంభించేశారు. కానీ కొనుగోలు దారులకు ఈ బుడా సంగతి తెలియదు కదా? ఎడాపెడా కొనుగోలుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. అసలే ఎన్నికల వేళ అంటూ రాని బుడాకు అనుమతులకు దరఖాస్తులు చేశామని టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల రియల్ వ్యాపారానికి మాత్రం బుడాను అప్పుడే వినియోగించుకుంటున్నారు. బుడా ప్రపోజ్డ్ అంటూ పెద్ద వెంచర్లు వేస్తూ ప్రజలను మస్కా కొడుతున్నారు. బుడా పరిధిలో 11 మండలాల్లోని 572 గ్రామాలతో పాటు మూడు మున్సిపాలిటీ(బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం)లను విలీనం చేస్తూ జీఓ విడుదల చేశారు. మొత్తంగా 7.52లక్షల జనాభా పరిధిలో బుడా తన సేవలను ప్రారంభించాల్సి ఉంది. దీనికి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తెంటు లకు‡్ష్మనాయుడు, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్లను నియమించారు. ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది. అలాగే కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించి బడ్జెట్ విడుదల చేయకపోవడంతో ఎక్కడిదక్కడే ఉండిపోయింది. దీనికి సంబంధించిన రివాల్వింగ్ ఫండ్ కానీ, డవలప్మెంట్ ఫండ్కానీ విడుదల చేయలేదు. కానీ బుడా పేరిట అప్పుడే రియల్ వ్యాపారాలు మా త్రం ప్రారంభమయ్యాయి. అర్బన్ డెవలప్మెంట్ పనులు ప్రారంభించక పోయినా, కార్యాలయాలు కానరాకపోయినా రియల్ వ్యాపారులకు మాత్రం ఈ బుడా ముందుగానే వినియోగపడుతోంది. రియల్ బ్రోచర్లు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ చిత్రం చూడండి! ఆ.. ఏముంది? ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేసుకుని విక్రయించుకుంటున్నారనుకుంటున్నారా? అంత వరకూ బానే ఉంది. దీనికి సంబంధించి అనుమతులు తీసుకునేందుకు ఏదేని పట్టణాభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి రియల్ ఎస్టేట్లకు ఇంకా కార్యకలాపాలు ప్రారంభించని, కార్యాలయమే లేని బుడాకు ప్రతిపాదించామని రియల్ వ్యాపారులు బోర్డులు పెట్టారు. అంతే కాదు. మంచి నగిషీలతో బ్రోచర్లు తయారు చేసి టీడీపీ నాయకుల కనుసన్నల్లో వ్యాపారాలు సాగిస్తున్నారు. -
‘డొనేట్‌కార్ట్’కు రూ.2.55 కోట్ల సీడ్ ఫండ్
రాయదుర్గం: ఆన్లైన్ డొనేషన్ ప్లాట్‌ఫామ్‌గా టీ–హబ్‌లో ఊపిరి పోసుకున్న ‘డొనేట్‌కార్ట్’కు రూ.2.55 కోట్ల సీడ్ ఫండింగ్ లభించింది. లెట్స్ వెంచర్, ఇతర ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా ఈ సీడ్ ఫండింగ్ లభించినట్లు డొనేట్‌కార్ట్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్‌రెడ్డి, సందీప్ శర్మ చెప్పారు. ఈ నిధులతో టెక్నాలజీని, టీమ్‌ను మరింత మెరుగుపర్చుకుంటామని వారు చెప్పారు. వీరిద్దరూ ఎన్ఐటి నాగ్‌పూర్‌లో చదువుకుని, 2016లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. చెన్నయ్‌లో వరదల సందర్భంగా నెల రోజులపాటు వలంటీర్‌గా పనిచేయటం ఈ స్టార్టప్ దిశగా తమను ప్రేరేపించిందని వారు చెప్పారు. డొనేట్‌కార్ట్ సంస్థ గడిచిన రెండున్నరేళ్లలో 30వేల మంది నుంచి రూ.5 కోట్ల విరాళాలను సేకరించింది. వాటిని 500 స్వచ్ఛంద సంస్థల ద్వారా అవసరార్థులకు పంపిణీ చేసింది. వచ్చే మూడేళ్ళలో రూ.100 కోట్ల విరాళాలను సేకరించి, అవసరార్థులకు అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. -
రియల్ జోరు
సాక్షి, జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గంలో ‘రియల్’ జోరు కొనసాగుతోంది. పట్టణం నుంచి పల్లెటూళ్ల వరకు ఎక్కడ చూసినా కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. పచ్చని పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. నియోజకవర్గానికి నిమ్జ్ రాబోతుండడంతో భూముల రేట్లకుఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయని, అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జహీరాబాద్ పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్తుంది. పట్టణానికి హైదరాబాద్ వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. మహీంద్ర అండ్ మహీంద్రతో పాటు చక్కెర కర్మాగారం, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో (జాతీయ పరిశ్రమల ఉత్పాదక మండలి) నిమ్జ్ రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఇప్పటికే నిమ్జ్ కోసం 3 వేల ఎకరాల భూమిని సేకరించింది. మరో 9 వేల ఎకరాలు సేకరించనుంది. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. రెండు మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎకరా రూ. 5లక్షల నుంచి రూ.8 లక్షలు పలకగా ప్రస్తుతం రూ.10లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న భూములు రూ.కోటికి పైనే పలుకుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల వ్యాపారులు అధిక ధర చెల్లించి ఇక్కడ భూములను కొంటున్నారు. రియల్ వ్యాపారంపై ఆసక్తి వ్యాపారులు జహీరాబాద్ ప్రాంతంలో వెంచర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన రహదారి, బైపాస్ రోడ్డులోని భూముల్లో ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నారు. జహీరాబాద్ పట్టణం చుట్టుపక్కల ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనమిస్తున్నాయి. చిన్నహైదరాబాద్, హోతి(కె), కాసీంపూర్, పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, దిడ్గి తదితర గ్రామాల పరిధిలో జహీరాబాద్– హైదరాబాద్, జహీరాబాద్–బీదర్, జహీరాబాద్ బైపాస్, అల్లానా రోడ్లలో వెంచర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. ప్లాట్లు చేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నిబంధనలు ఇలా.. పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేయడానికి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. భూమి రిజిస్ట్రేషన్ విలువల్లో పది శాతం నాలా రుసుము కింది చెల్లించాలి. ఆ తరువాత ఫైల్‌ను తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తారు. ఆర్డీఓ కార్యాలయం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యవసాయేతర భూమిగా మార్పు చేస్తున్నట్లు పత్రం జారీ చేస్తారు. సంబంధిత భూ యజమాని వెంచర్ కోసం 40 ఫీట్స్‌తో ప్రధాన రోడ్డు, 33 ఫీట్స్‌తో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ దీపాలు, తాగునీటి వసతులు కల్పించాలి. పార్కు, డంపింగ్ యార్డు, అంగన్వాడి కేంద్రాల కోసం మున్సిపల్, పంచాయతీల పేరున భూమిలో 10 శాతం రిజిస్ట్రేషన్ చేయించాలి. మున్సిపల్, పంచాయతీలు, డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకుని ప్లాట్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండానే.. జహీరాబాద్ ప్రాంతంలో వెలుస్తున్న వెంచర్లలో అధికశాతం అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జహీరాబాద్– హైదరాబాద్ రహదారిలోని అనేక వెంచర్లు పంట పొలాల్లోనే వెలిశాయి. పెద్ద పెద్ద వెంచర్లు మాత్రం అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతుండగా చిన్న చిన్న వెంచర్లు నామమాత్రపు అనుమతులు తీసుకుని పొలాలను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. అనుమతులు లేకుండా చేసిన వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు ఆ తరువాత ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ వెంచర్లతో మున్సిపల్, పంచాయతీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
స్కెచర్స్ చేతికి 49% ఫ్యూచర్స్ వాటా
న్యూఢిల్లీ: స్కెచర్స్ ఇండియా జాయింట్ వెంచర్లో ఫ్యూచర్స్ గ్రూప్‌నకు ఉన్న 49% వాటాను మాతృ కంపెనీ స్కెచర్స్ యూఎస్ఏ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు వెల్లడించలేదు. అయితే ఈ వాటా కొనుగోలు కోసం అమెరికాకు చెందిన స్కెచర్స్ కంపెనీ రూ.600 కోట్లు వెచ్చించిందని సమాచారం. దీంతో స్కెచర్స్ ఇండియా ఇక పూర్తిగా స్కెచర్స్ యూఎస్ఏ అనుబంధ సంస్థగా మారిపోయింది. మరింతగా వృద్ధి జోరు... ఇతర దేశాల్లో లాగానే ఆకర్షణీయమైన వృద్ధి అవకాశాలతో భారత్‌లోకి ప్రవేశించామని స్కెచర్స్ సీఎఫ్ఓ డేవిడ్ వీన్‌బర్గ్ చెప్పారు. జాయింట్ వెంచర్లో మైనారిటీ వాటాను కొనుగోలు చేశామన్నారు. ఈ కొనుగోలు స్కెచర్స్ ఇండియా వృద్ధి జోరును మరింతగా పెంచుతుందని స్కెచర్స్ సౌత్ ఏషియా సీఈఓ రాహుల్ విరా పేర్కొన్నారు. కార్యకలాపాల విస్తరణను మరింత వేగవంతం చేస్తుందని, భారత్‌లో మరింత మార్కెట్ వాటా కొనుగోలు కోసం పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ఈ కొనుగోలు దోహదం చేస్తుందని వివరించారు. ఈ ఏడాది 80 నుంచి వంద కొత్త స్టోర్స్.... స్కెచర్స్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు ద్వారా భారత్‌లో 2012లో ప్రవేశించింది. ప్రస్తుతం భారత్‌లో స్కెచర్స్ కంపెనీ 223 రిటైల్ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. వీటిల్లో 61 స్వంత స్టోర్స్ కాగా, మిగిలినవి థర్డ్ పార్టీ ఆధ్వర్యంలోనివి. ఈ ఏడాది కొత్తగా 80 నుంచి వంద స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. -
తుర్కపల్లి : అక్రమవెంచర్లకు అడ్డేదీ ?
సాక్షి, తుర్కపల్లి : రియల్ ఎస్టేట్ భూమ్ పెరిగి పోవడంతో భూముల ధరలు కూడా అమాంతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను స్వల్ప ధరలకు కొనుగోలు చేసుకొని వాటిలో ప్లాట్లు చేసి వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు.అధికార యంత్రాంగానికి ఈ తంతు తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఈ దందా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుంది.హైదరాబాద్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న తుర్కపల్లి మండలంలో అక్రమ వెంచర్ల హవా కొనసాగుతున్నా అధికారులకు పట్టకపోవడం శోచనీయం. తక్కువ ధరలకు భూముల కొనుగోలు.. వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసుకొని, ఆ భూమిలోనే 200 గజాలు, 100 గజాలు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నా రు. మండల కేంద్రం హైదరాబాద్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉం డటం, యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃనిర్మాణం కావడంతో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వ్యవసాయభూములు ఎకరానికి కోటి నుంచి కోటి 50 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల దగ్గర నుంచి ఎకరాల చొప్పున కొనుగోలు చేసుకొని ఎ టువంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అనుమతులు కరువు .. తుర్కపల్లి, మాదాపూర్, దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్, వెంకటాపూర్, పల్లెపహాడ్, ముల్కలపల్లి, రుస్తాపూర్ గ్రామాల్లో ఈ రియల్ ఎస్టేట్ దందా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను విక్రయించి వాటిని ప్లాట్లుగా మార్చేటప్పుడు డీటీసీపీ అనుమతులు పొందాలి. కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్‌శాఖ, అటవీశాఖ, గ్రామపంచాయతీ అనుమతులు, నీటి పారుదల శాఖ ముందస్తు అనుమతులు పొందాలి. అధికారులు వెంచర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. అక్రమ వెంచర్లపై చర్య తీసుకుంటాం.. మండలంలో నిర్వహిస్తున్న అక్రమ వెంచర్లపైన చర్యలు తీసుకుంటాం. గతంలో మా దృష్టికి వచ్చిన వాటికి హద్దురాళ్లు తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన చర్యలు తీసుకున్నాం. గ్రామ కార్యదర్శులకు ఈ విషయంలో అవగాహన కలిగించి సత్వర చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌళి, ఈఓపీఆర్డీ -
100 ఎకరాల్లో ఆంబియెన్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిలోని షాద్‌నగర్‌లో స్పేస్ విజన్ గ్రూప్ భారీ వెంచర్లకు శ్రీకారం చుట్టింది. ఆంబియెన్స్, గ్రీన్ ఎకర్స్ పేరిట 600 ఎకరాల్లో ఒకేసారి నాలుగు ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. మరిన్ని వివరాలు స్పేస్ విజన్ సీఎండీ టీవీ నరసింహా రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ♦ దాదాపు రెండు దశాబ్దాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా. 2007లో సొంతంగా స్పేస్ విజన్ కంపెనీని ప్రారంభించా. ఇప్పటివరకు ఈ కంపెనీ నుంచి గాజుల రామారాం, గచ్చిబౌలి, షాద్‌నగర్, మహేశ్వరం, కొత్తూరు, భువనగిరి, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో భారీ వెంచర్లను పూర్తి చేశాం. తాజాగా షాద్‌నగర్ కేంద్రంగా పలు ప్రాజెక్ట్‌లు చేస్తున్నాం. ప్రభుత్వ నుంచి అన్ని రకాల అనుమతులొచ్చాకే వెంచర్‌ను ప్రారంభించడం స్పేస్ విజన్ లక్ష్యం. అమ్మకాలతో సంబంధం లేకుండా ఏడాదిలో వెంచర్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తాం. ప్రస్తుతం మా కంపెనీలో 2 వేల మంది ఉద్యోగులున్నారు. ♦షాద్‌నగర్‌లోని విట్యాలలో 100 ఎకరాల్లో ఆంబియెన్స్–2ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది డీటీసీపీ అనుమతి పొందిన ప్రాజెక్ట్. బూర్గులలో ఆంబియెన్స్–3 పేరిట 150 ఎకరాల్లో మరో వెంచర్ ఉంది. ఇది కూడా డీటీసీపీ అనుమతి పొందిన వెంచరే. ♦ షాద్‌నగర్ టోల్గేట్ తర్వాత ఉన్న రాజాపూర్‌లో 150 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్–2, పోలెపల్లి సెజ్ వెనక భాగంలో 200 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్–3 పేరిట ఫామ్‌ల్యాండ్ వెంచర్లను చేస్తున్నాం. ఇప్పటివరకు పోలెపల్లి సెజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 600 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్ ఫేజ్–1, 2, 3 వెంచర్లను పూర్తి చేశాం. ♦ ఇవి కాకుండా వచ్చే నెలలో ఆమన్‌గల్‌లో 200 ఎకరాల్లో భారీ వెంచర్‌ను ప్రారంభించనున్నాం. నగరంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా భారీ గేటెడ్ కమ్యూనిటీ నివాస సముదాయం ప్రాజెక్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాం. ♦ ఇక్కడే ప్రాజెక్ట్‌లను చేయడానికి కారణమేంటంటే? ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే కావాల్సినవి మెరుగైన మౌలిక వసతులు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు. ఈ విషయంలో షాద్‌నగర్ సరైన ప్రాంతం. నిజం చెప్పాలంటే రోడ్డు, రైలు, విమాన.. మూడు రకాల రవాణా సౌకర్యాలున్న ప్రాంతం షాద్‌నగరే. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జడ్చర్ల వరకు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్–బెంగళూరు 8 లైన్ల జాతీయ రహదారి, జడ్చర్లలో ఐటీ హబ్‌తో పాటూ పోలెపల్లి సెజ్, ఇతరత్రా పరిశ్రమలున్నాయి. పోలెపల్లి సెజ్‌లో సుమారు లక్ష మంది ఉద్యోగులుంటారు. ఏ ఏరియా అయినా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు రావాలి. ఇవి రెండూ షాద్‌నగర్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో స్థలాల ధరలు రెండింతలయ్యాయి. ♦ అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతంలో వెంచర్లు చేయడం వల్లే స్పేస్ విజన్‌పై కస్టమర్లకు నమ్మకం. అందుకే రిపీటెడ్ కస్టమర్లే మాకెక్కువగా ఉంటారు. రెండేళ్ల క్రితం గాజులరామారంలో వెంచర్లో గజం ధర రూ.11 వేలకు విక్రయించాం. ఇప్పుడక్కడ రూ.30 వేలుంది. నాలుగేళ్ల క్రితం గచ్చిబౌలిలో గజం రూ.5 వేలుంటే... ఇప్పుడక్కడ రూ.30 వేలు దాటింది. భువనగిరిలో గజం రూ.600లకు విక్రయించాం. ఇప్పుడు రూ.3 వేలుంది. -
300 ఎకరాలు.. 5 ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: సామాన్యులకు అందుబాటు ధరల్లో రియల్ పెట్టుబడులకు, అభివృద్ధికి అపార అవకాశాలున్న ప్రాంతం హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి. పోచారంలోని ఐటీ కంపెనీలు, యాదాద్రి అభివృద్ధి పనులు, వరంగల్ హైవే విస్తరణ పనులు, స్థానిక అంతర్జాతీయ ఆసుపత్రులు, విద్యా సంస్థలు.. వంటి వాటితో ఈ ప్రాంతంలో రియల్టీ జోష్‌లో ఉంది. ఇలాంటి ప్రాంతంలో అందుబాటు ధరల్లో రియల్ ప్రాజెక్ట్‌లను చేపడుతుంది సుఖీభవ ప్రాపర్టీస్. ఆయా వెంచర్ వివరాలు సంస్థ సీఎండీ ఏ గురురాజ్ మాటల్లోనే.. కీసరలో 8 ఎకరాల్లో సుఖీభవ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. హెచ్ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్లో మొత్తం 84 ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.16 వేలు. బ్లాక్‌టాప్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ పైప్‌లైన్స్ వంటి అన్ని రకాల డెవలప్మెంట్స్ పూర్తయ్యాయి. రాయగిరిలో 9 ఎకరాల్లో హైవే ఫేస్ పేరిట మరో వెంచర్‌ను చేస్తున్నాం. వైటీడీఏ అనుమతి పొందిన ఈ ప్రాజెక్ట్‌లో 150 నుంచి 500 గజాల్లో ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.10 వేలు. రాయగిరి జంక్షన్లో 7 ఎకరాల్లో హరినివాస్ను అభివృద్ధి చేస్తున్నాం. ధర గజానికి రూ.6,999. కూనూరులో 150 ఎకరాల్లో వనమాలి టౌన్షిన్ కూడా ఉంది. ఇందులో కేవలం 150 ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నా యి. ధర గజానికి రూ.4,300. క్లబ్ హౌస్‌తో పాటూ మౌలిక వసతులన్నీ పూర్తయ్యాయి. జనగాంలో 200 ఎకరాల్లో స్మార్ట్‌సిటీ పేరిట ఇండిపెండెంట్ హౌస్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇందులో 50 ఎకరాల్లో ఇండిపెండెంట్ హౌస్‌లు, 150 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లుంటాయి. 165 గజాల్లో 1,053 చ.అ.ల్లోని ఒక్కో ఇండిపెండెంట్ హౌస్ «దర రూ.26 లక్షలు. రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. -
అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకుంటాం
దురాజ్‌పల్లి (చివ్వెంల) : నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్పీఓ వి.సురేష్‌మోహన్ అన్నారు. గురువారం మండలంలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులో అక్రమంగా చేసిన వెంచర్లను పరిశీలించారు. నిబంధలనకు విరుద్ధంగా చేసిన వెంచర్లలో హద్దురాళ్లను తొలగించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట, చివ్వెంల మండలాల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా, నాలా పన్ను కట్టకుండా అక్రమంగా చేసిన చివ్వెంల మండలం బీబిగూడెం, కుడకుడ, దురాజ్‌పల్లి, సూర్యాపేట మండలం గాంధీనగర్, పిల్లలమర్రి, రాయిన్‌గూడెం గ్రామాల్లోని వెంచర్లను తొలగించాలని కార్యదర్శులను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతి లేని వెంచర్లలో ఎవరు ప్లాట్లు కోనుగోలు చేయవద్దన్నారు. ఈ సమావేశంలో ఈఓఆర్డీలు లక్ష్మి, గోపి, సూర్యాపేట, చివ్వెంల మండలాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో బిజినెస్‌లోకి అల్లు అర్జున్
-
జీవిత చరిత్ర రాసిన పప్పూయాదవ్