ప్లాట్లు కొంటే పాట్లే..! | Illegal Ventures In Nalgonda | Sakshi
Sakshi News home page

ప్లాట్లు కొంటే పాట్లే..!

Published Thu, Nov 7 2019 9:21 AM | Last Updated on Thu, Nov 7 2019 9:26 AM

Illegal Ventures In Nalgonda - Sakshi

నెమిల గ్రామంలో ఏర్పాటు చేసిన వెంచర్‌లో హద్దురాళ్లు తొలగిస్తున్న పంచాయతీ సిబ్బంది

సాక్షి, యాదాద్రి : జిల్లాలో మున్సిపాలిటీలు, జాతీయ రహదారులు, వైటీడీఏ, హెచ్‌ఎండీఏ మండలాల్లో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. వందల ఎకరాల సాగు భూములను స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్లుగా మార్చేస్తున్నారు. వీటిని విక్రయిస్తూ మూడు పువ్వులు, ఆరు కాయల్లా సంపాదన చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కళ్లు తెరవడం లేదు. వెరసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. 

నిబంధనలు పాటించకుండానే..
జిల్లాలో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గత ఏడాది వరకు 726 ఉన్న లేఅవుట్లు ఉండగా ప్రస్తుతం 1000కి చేరాయి.  ఇందులో కేవలం 217 వెంచర్లకు మా త్రమే అనుమతులున్నాయి. వాటిలోనూ అనేక లొసుగులున్నాయి. వెంచర్లలో ప్రజాప్రయోజనాల కోసం 10శాతం భూములను సైతం వి డువకుండానే వ్యాపారులు  ప్లాట్ల విక్రయాలు జరిపారు. ఎక్కడో ఓ చోట  వెంచర్‌లో 10 శా తం భూమి వదిలినప్పటికీ  ఇటీవల రియల్‌ఎ స్టేట్‌ వ్యాపారులు మాఫియాగా మారి ఆ స్థలా లను అక్రమ పద్ధతుల ద్వారా అమ్ముకున్నారు.  

నిబంధనలు పాటించడం లేదు
జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల్లో  అక్రమ వెంచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.  వెంచర్‌ చేసేటప్పుడు నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను వాణిజ్య భూములుగా మార్చాలి. ఇందుకోసం నాలా పన్ను చెల్లించాలి. అనంతరం 10శాతం భూమిని ప్రజా అవసరాల కోసం ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పేరున గిఫ్ట్‌గా రిజిస్ట్రేషన్‌ చేయాలి.

మౌలిక వసతులైన రోడ్లు, మంచి నీరు, విద్యుత్‌ సౌకర్యం, పార్కులు ఏర్పాటు చే యాలి. గ్రామపంచాయతీల నుంచి ఎన్‌ఓసీ తీ సుకుని హెచ్‌ఎండీఏ, వైటీడీఏ,  డీటీసీపీ ద్వారా లేఅవుట్‌కు అనుమతి పొందాలి. ఈప్రాథమిక అంశాలేమీ లేకుండానే రైతులకు సంబం ధించిన భూములను కొనుగోలు చేసి హద్దురాళ్లు నాటి క్రయవిక్రయాలు చేస్తున్నారు. కొన్ని సార్లు అధికారులు హద్దురాళ్లు, బోర్డులు తొలగించినా మరుసటి రోజు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. 

బ్రోచర్లపైనే అందమైన నమూనాలు..
హైదరాబాద్‌ కేంద్రంగా జిల్లాలోని అక్రమ లేఅవుట్ల ఫ్లాట్ల క్రయవిక్రయ వ్యాపారం సాగుతోంది. యాదాద్రి దేవస్థానం అభివృద్ధి,  సమీ కృత కలెక్టర్, గ్రీన్‌  ఇండస్ట్రీయల్‌ పార్కు,  ఎయి మ్స్, జాతీయ రహదారులు, ఎంఎంటీఎస్‌ రైలు, భువనగిరి ఖిలా, పోచంపల్లి, కొలనుపాక అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా అందమైన బ్రోచర్లు రూపొందించి ప్లాట్లు అంటడుతున్నారు.

ఆదివారం వస్తే జాతరే..
అదివారం వచ్చిందంటే వెంచర్లు జాతరను తలపిస్తాయి. రియల్టర్లు తమ ఏజెంట్లద్వారా హైదరాబాద్‌ నుంచి  కార్లలో కొనుగోలు దారులను తీసుకువచ్చి లేఅవుట్లలో విందులు, వినోదాలు ఏర్పాటు చేసి ప్లాట్ల కొనుగోలుకు ఒప్పిస్తున్నారు.  ప్లాట్‌  మొత్తం ధరలో ఏజెంట్లకు  40శాతం కమీషన్‌ చెల్లిస్తున్నారు.  ఏజెంట్లు అక్రమ లేఅవుట్ల ప్లాట్లను పేద, మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు. 

అక్రమ వెంచర్లు ఎక్కువగా ఉన్నదిక్కడే..  
భువనగిరి మున్సిపాలిటీ, మండలంలో వడాయిగూడెం, వీరవెల్లి, రామచంద్రాపురం, అనంతారం, నందనం, గంగసానిపల్లి, జమ్మాపూర్, తాజ్‌పూర్, ముత్తిరెడ్డిగూడెం, పగిడిపల్లి, వడపర్తి, నాగిరెడ్డిపల్లి, హన్మాపూర్, ఆర్‌ఎన్‌తం డా, బస్వాపూర్, తుక్కాపూర్, చందుపట్ల, పెం చికల్‌పహాడ్, అనాజిపూర్, బొమ్మాయిపల్లి, చీమలకొండూర్, బాలంపల్లి, కూనూర్, రాయగిరి.

బీబీనగర్‌ మండలం : అన్నంపట్ల, భట్టుగూడెం, బీబీనగర్, బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి, గొల్లగూడెం, గూడూరు, గుర్రాలదండి, జైనపల్లి, కొండమడుగు, లక్ష్మీదేవిగూడెం, మక్తానంతారం, మాదారం, ముగ్ధుంపల్లి, నెమురగోముల, పడమటిసోమారం, పల్లెగూడెం, రాఘవాపూర్, రహీంఖాన్‌గూడెం, రాయరావుపేట, రామునిగుండ్లతండా, రావిపహాడ్, రుద్రవెల్లి, వెంకిర్యాల.

భూదాన్‌పోచంపల్లి : మున్సిపాలిటీ,  మండలంలోని జలాల్‌పూర్, పిలాయిపల్లి, దేశ్‌ముఖి, పెద్దగూడెం, పోచంపల్లి, జగత్‌పల్లి, జలాల్‌పూర్‌.

యాదగిరిగుట్ట : మున్సిపాలిటీ పరిధి లోని రామాజీపేట్‌తో పాటు చిన్నకందుకూర్, చొల్లేరు, దాత్తర్‌పల్లి, జంగంపల్లి, వంగపల్లి, కాచారం, బాహుపేట, పెద్దకందుకూర్,మోటకొండూర్, మల్లాపూర్, సాదువెల్లి, గౌరాయపల్లి, మాసాయిపేట, మహబూబ్‌పేట, సైదాపూర్‌.

ఆలేరు :  మున్సిపాలిటీ పరిధిలోని దిలావపూర్, గొలనుకొండ, ఇక్కుర్తి, కొలనుపాక, మంతపురి, మాటూరు, పటేల్‌గూడెం, రాఘవాపురం, శారా జీ పేట, శర్బనాపురం, తూర్పుగూడెం.
మోత్కూర్‌ : మున్సిపాలిటీలో 15వెంచర్లను  ఏర్పాటు చేశారు. 5వెంచర్లకు అనుమతులుం డగా 10వెంచర్లకు ఎలాంటి అనుమతులు లేవు. 

పోలీస్‌స్టేషన్‌లకు బాధితులు
జిల్లాలో ఏర్పాటు చేసిన అక్రమం లేఅవుట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన Ðవారు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి పిర్యాదు చేస్తున్నారు.   ఈ ఏడాది 100కు పైగా కేసులు నమోదైనట్లు పోలీస్‌ అధికారులు చెబుతున్నారుహద్దురాళ్లు తొలగించాం. నెమిలె పంచాయతీ పరిధిలో వెంచర్‌కు డీటీసీ పీ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌) అనుమతి లేదు. డీపీఓ,ఈఓపీఆర్డీ ఆదేశాలతో  ఇప్ప టికీ 4 సార్లు హద్దురాళ్లు తొలగించాం. 
–నెమిల పంచాయతీ కార్యదర్శి, రఘుపతిరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement