
సాక్షి, హైదరాబాద్: సామాన్యులకు అందుబాటు ధరల్లో రియల్ పెట్టుబడులకు, అభివృద్ధికి అపార అవకాశాలున్న ప్రాంతం హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి. పోచారంలోని ఐటీ కంపెనీలు, యాదాద్రి అభివృద్ధి పనులు, వరంగల్ హైవే విస్తరణ పనులు, స్థానిక అంతర్జాతీయ ఆసుపత్రులు, విద్యా సంస్థలు.. వంటి వాటితో ఈ ప్రాంతంలో రియల్టీ జోష్‌లో ఉంది. ఇలాంటి ప్రాంతంలో అందుబాటు ధరల్లో రియల్ ప్రాజెక్ట్‌లను చేపడుతుంది సుఖీభవ ప్రాపర్టీస్. ఆయా వెంచర్ వివరాలు సంస్థ సీఎండీ ఏ గురురాజ్ మాటల్లోనే.. కీసరలో 8 ఎకరాల్లో సుఖీభవ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్‌లో మొత్తం 84 ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.16 వేలు. బ్లాక్‌టాప్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ పైప్‌లైన్స్ వంటి అన్ని రకాల డెవలప్‌మెంట్స్ పూర్తయ్యాయి.
రాయగిరిలో 9 ఎకరాల్లో హైవే ఫేస్ పేరిట మరో వెంచర్‌ను చేస్తున్నాం. వైటీడీఏ అనుమతి పొందిన ఈ ప్రాజెక్ట్‌లో 150 నుంచి 500 గజాల్లో ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.10 వేలు. రాయగిరి జంక్షన్‌లో 7 ఎకరాల్లో హరినివాస్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ధర గజానికి రూ.6,999. కూనూరులో 150 ఎకరాల్లో వనమాలి టౌన్‌షిన్ కూడా ఉంది. ఇందులో కేవలం 150 ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నా యి. ధర గజానికి రూ.4,300. క్లబ్ హౌస్‌తో పాటూ మౌలిక వసతులన్నీ పూర్తయ్యాయి. జనగాంలో 200 ఎకరాల్లో స్మార్ట్‌సిటీ పేరిట ఇండిపెండెంట్ హౌస్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇందులో 50 ఎకరాల్లో ఇండిపెండెంట్ హౌస్‌లు, 150 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లుంటాయి. 165 గజాల్లో 1,053 చ.అ.ల్లోని ఒక్కో ఇండిపెండెంట్ హౌస్ «దర రూ.26 లక్షలు. రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్ వంటి అన్ని రకాల వసతులుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment