
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిలోని షాద్‌నగర్‌లో స్పేస్ విజన్ గ్రూప్ భారీ వెంచర్లకు శ్రీకారం చుట్టింది. ఆంబియెన్స్, గ్రీన్ ఎకర్స్ పేరిట 600 ఎకరాల్లో ఒకేసారి నాలుగు ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. మరిన్ని వివరాలు స్పేస్ విజన్ సీఎండీ టీవీ నరసింహా రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు.
♦ దాదాపు రెండు దశాబ్దాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా. 2007లో సొంతంగా స్పేస్ విజన్ కంపెనీని ప్రారంభించా. ఇప్పటివరకు ఈ కంపెనీ నుంచి గాజుల రామారాం, గచ్చిబౌలి, షాద్‌నగర్, మహేశ్వరం, కొత్తూరు, భువనగిరి, ఘట్‌కేసర్ వంటి ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో భారీ వెంచర్లను పూర్తి చేశాం. తాజాగా షాద్‌నగర్ కేంద్రంగా పలు ప్రాజెక్ట్‌లు చేస్తున్నాం. ప్రభుత్వ నుంచి అన్ని రకాల అనుమతులొచ్చాకే వెంచర్‌ను ప్రారంభించడం స్పేస్ విజన్ లక్ష్యం. అమ్మకాలతో సంబంధం లేకుండా ఏడాదిలో వెంచర్‌లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తాం. ప్రస్తుతం మా కంపెనీలో 2 వేల మంది ఉద్యోగులున్నారు.
♦షాద్‌నగర్‌లోని విట్యాలలో 100 ఎకరాల్లో ఆంబియెన్స్–2ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది డీటీసీపీ అనుమతి పొందిన ప్రాజెక్ట్. బూర్గులలో ఆంబియెన్స్–3 పేరిట 150 ఎకరాల్లో మరో వెంచర్ ఉంది. ఇది కూడా డీటీసీపీ అనుమతి పొందిన వెంచరే.
♦ షాద్‌నగర్ టోల్‌గేట్ తర్వాత ఉన్న రాజాపూర్‌లో 150 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్–2, పోలెపల్లి సెజ్ వెనక భాగంలో 200 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్–3 పేరిట ఫామ్‌ల్యాండ్ వెంచర్లను చేస్తున్నాం. ఇప్పటివరకు పోలెపల్లి సెజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 600 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్ ఫేజ్–1, 2, 3 వెంచర్లను పూర్తి చేశాం.
♦ ఇవి కాకుండా వచ్చే నెలలో ఆమన్‌గల్‌లో 200 ఎకరాల్లో భారీ వెంచర్‌ను ప్రారంభించనున్నాం. నగరంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా భారీ గేటెడ్ కమ్యూనిటీ నివాస సముదాయం ప్రాజెక్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాం.
♦ ఇక్కడే ప్రాజెక్ట్‌లను చేయడానికి కారణమేంటంటే? ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే కావాల్సినవి మెరుగైన మౌలిక వసతులు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు. ఈ విషయంలో షాద్‌నగర్ సరైన ప్రాంతం. నిజం చెప్పాలంటే రోడ్డు, రైలు, విమాన.. మూడు రకాల రవాణా సౌకర్యాలున్న ప్రాంతం షాద్‌నగరే. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జడ్చర్ల వరకు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్–బెంగళూరు 8 లైన్ల జాతీయ రహదారి, జడ్చర్లలో ఐటీ హబ్‌తో పాటూ పోలెపల్లి సెజ్, ఇతరత్రా పరిశ్రమలున్నాయి. పోలెపల్లి సెజ్‌లో సుమారు లక్ష మంది ఉద్యోగులుంటారు. ఏ ఏరియా అయినా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు రావాలి. ఇవి రెండూ షాద్‌నగర్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో స్థలాల ధరలు రెండింతలయ్యాయి.
♦ అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతంలో వెంచర్లు చేయడం వల్లే స్పేస్ విజన్‌పై కస్టమర్లకు నమ్మకం. అందుకే రిపీటెడ్ కస్టమర్లే మాకెక్కువగా ఉంటారు. రెండేళ్ల క్రితం గాజులరామారంలో వెంచర్‌లో గజం ధర రూ.11 వేలకు విక్రయించాం. ఇప్పుడక్కడ రూ.30 వేలుంది. నాలుగేళ్ల క్రితం గచ్చిబౌలిలో గజం రూ.5 వేలుంటే... ఇప్పుడక్కడ రూ.30 వేలు దాటింది. భువనగిరిలో గజం రూ.600లకు విక్రయించాం. ఇప్పుడు రూ.3 వేలుంది.
Comments
Please login to add a commentAdd a comment