సాక్షి, హైదరాబాద్: వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ప్రజలను మోసం చేసిన ఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ రాయల్ లీఫ్, రాయల్ పేరడైజ్, రాయల్ మింట్ పేరుతో మూడు వెంచర్లు వేసి 300 మంది దగ్గర సుమారు 50 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. మైత్రి ప్రాజెక్ట్ ఎండి జానీ భాషా షేక్ గత మూడు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మబ్బి పెడుతూ కాలం గడుపుతున్నాడని బాధ్యతలు తెలిపారు.
ఒక్కసారిగా అందరూ అడిగేసరికి రాత్రికి రాత్రి ఫ్యామిలీతో పారిపోయాడని, ఇందుకోసం మూడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పుడు దాకా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. ఇందులో అందరూ మధ్య తరగతి, పేద తరగతి వారే ఉన్నామని దయచేసి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఇందుకు నిరసనగా ఈరోజు మియాపూర్ ఆల్విన్ కాలనీలోని మైత్రి ప్రాజెక్ట్స్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసుల స్పందించి వెంటనే జానీ భాషా షేక్ ను అరెస్టు చేయాలని కోరారు.
చదవండి: ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నాకు తోడుగా ఉంటావనుకుంటే..
Comments
Please login to add a commentAdd a comment