Small Enterprises
-
ఆ కంపెనీలకు పన్ను తగ్గిందోచ్!
-
ఆ కంపెనీలకు పన్ను తగ్గిందోచ్!
చిన్న సంస్థలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఊరటనిచ్చారు. వారిపై వేసే పన్నుపై 5 శాతం తగ్గించారు. రూ.50 కోట్ల టర్నోవర్ వరకున్న కంపెనీలకు వేసే ఆదాయపు పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్టు జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. నల్లధనం నిర్మూలించడానికి పెద్దనోట్లను రద్దు చేయడంతో ఆర్థికవ్యవస్థ మందగించింది. డిమాండ్‌లో ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న, మధ్యతరహా సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. డిమాండ్‌పై పడిన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు బడ్జెట్లో పలు పన్ను ప్రోత్సహకాలను ప్రవేశపెడతారని పలు రేటింగ్ సంస్థలు అంచనావేశాయి. ఈ మేరకు జైట్లీ ప్రకటన వెలువరిచారు. చిన్న సంస్థలపై విధించే ఆదాయపు పన్నును దశల వారీగా 25 శాతానికి తగ్గిస్తామని తెలిపారు. చిన్న కంపెనీలపై తగ్గించిన పన్నుతో ప్రభుత్వానికి రూ.7200 కోట్ల రెవెన్యూ నష్టం నెలకొననుంది. -
నోట్లరద్దుతో ఉద్యోగాలు, చిన్నసంస్థలకు ముప్పేనట!
న్యూఢిల్లీ:ప్ రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన డీమానిటైజేషన్ ప్రభావం వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందట. పరిశ్రమ చాంబర్ అసోచామ్ నిర్వహించిన ఓ సర్వేలో ఈవిషయాలు వెలుగులో కి వచ్చాయి. చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) పై ప్రతికూల ప్రభావాన్ని పడేవేస్తుందని అంచనా వేసింది. అలాగే గ్రామీణ వినియోగం, ఉద్యోగాల కల్పనను కూడా పెద్దనోట్ల రద్దు భారీగా ప్రభావితం చేయనుందని తెలిపింది. అయితే పెద్ద వ్యవస్థీకృత రంగాల్లో దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూరనున్నాయని అసోచామ్ ఆదివారం వెల్లడిచేసిన సర్వే ఫలితాల్లో ఈ విషయాలను ప్రకటించింది. గత ఏడాది నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వ్యవసాయం, సిమెంట్, ఎరువులు, ఆటోమొబైల్, టెక్స్ టైల్స్, రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడనుందని ఈ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో చిన్న పరిశ్రమలు, సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని 81.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో త్రైమాసికంలో నష్టాలు తప్పవని చెప్పారు. పెట్టుబడుల ఆధారిత సమస్యలుంటాయని, ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో వినియోగదారుల విశ్వాసం, డిమాండ్ పడిపోతుందని 66 శాతానికిపైగా అభిప్రాయపడ్డారు. అయితే నగదు కొరత సంక్షోభం కారణంగా అమ్మకాలు లేక కూరగాయలు, ఇతర పంటలు ధరలు పడిపోయాయనీ, ద్రవ్యోల్బణం మీద అనుకూల ప్రభావాన్ని ఉంటుందని చెప్పారు. మరోవైపు దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనాలుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ , ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు మేలు చేకూరనుందని సర్వే ద్వారా తేలింది. కాగా సర్వేలో ఈ ఫలితాలు వెల్లడైనప్పటికీ ప్రస్తుతం వాస్తవ పరిస్థిని అంచనా వేయడం కష్టమనీ, కరెన్సీ కుదుపు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని పడనుందనే అంచనాలకు మరికొంత సమయం పడుతుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ చెప్పారు. -
ఉపాధి కర్మాగారం!
ఖైదీల్లో ఆత్మస్థైర్యం స్వయం ఉపాధితో ఆర్థిక ఆసరా భవిష్యత్తుపై భరోసా విశాఖ సెంట్రల్ జైల్ ఖైదీల్లో ఆత్మస్థైర్యం పెంచుతోంది. ఎవరికి నచ్చిన పనిలో వారు నైపుణ్యం సాధించేందుకు చేయూతనిస్తోంది. ఉపాధి కల్పించి ఆర్థిక ఆసరా కల్పిస్తూ భావి జీవితానికి భరోసానిస్తోంది. జైలు నుంచి విడుదలయ్యాకా ఇక్కడ నేర్చుకున్న చేతి వృత్తితో ఉపాధి కల్పించుకుని తమ కుటుంబ సభ్యులతో సగర్వంగా జీవించే పరిస్థితి కల్పిస్తోంది. సాగర్‌నగర్ : విశాఖ కేంద్ర కారాగారం కర్మాగారంగా మారుతోంది. జైలులో ఏర్పాటు చేసిన పలు చిన్న పరిశ్రమలు రానురాను అభివృద్ధి చెందుతూ ఖైదీలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. క్షణికావేశంలో తప్పుచేసి కన్నవారికి, కట్టుకున్నవారికి దూరంగా ఉంటూ నాలుగు గోడల మధ్య ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్న ఖైదీల స్వయం ఉపాధికి దారి చూపుతున్నాయి. ఎవరికి ఇష్టమైన పనిని వారు ఎంచుకుని ఆ పనుల్లో నైపుణ్యం సాధిస్తూ ఆర్థికంగా కాస్త సంపాదించుకుంటున్నారు. జైలు అధికారులు కూడా వారికి తగిన సహకారం అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. విస్తరిస్తున్న పరిశ్రమలు వ్యవసాయంతో పాటు జౌళి, టైలరింగ్, స్టీల్, బుక్ బైండింగ్, జీడి పప్పు ప్యాకింగ్, చీపుర్లు, ప్రింటింగ్ ప్రెస్, విస్తర్లు, కార్పెట్ల తయారీ, పెయింటింగ్ తదితర పరిశ్రమలను జైలు అధికారులు నిర్వహిస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో వందల మంది ఖైదీలు పనిచేస్తూ వేతనాలు పొందుతున్నారు. చీపుర్లు తయారీ వంటి చిన్న పరిశ్రమల్లోనూ రిమాండ్ ఖైదీలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ కంపెనీల వల్ల జైలు సంక్షేమ నిధికి ఏడాదికి లక్షల్లో ఆదాయం లభిస్తోంది. ఇక్కడ ఓలం కంపెనీ నిర్వహిస్తున్న జీడి పిక్కల పరిశ్రమలో పనిచేస్తున్న ఖైదీలకు రోజుకు రూ.100లు చెల్లిస్తారు. ఇందులో 100 మందికి పైగా ఖైదీలు పనిచేస్తున్నారు. మిగిలిన పరిశ్రమల్లో జైళ్ల శాఖ నిర్ణయించిన విధంగా నైపుణ్యం గల ఖైదీలకు రోజుకు రూ.70లు, నైపుణ్యంలేని ఖైదీలకు రూ.50లు చొప్పున వేతాలు చెల్లిస్తున్నారు. ఆ ఆదాయం వారి బ్యాంక్ ఖాతాకు చేరుతుంది. దానిలో కొంత జైల్లో వారి అవసరాలకు ఉపయోగించుకొంటున్నారు. ఈ పరిశ్రమల ద్వారా వచ్చి ఆదాయం కొంత జైళ్ల సంక్షేమ నిధికి చేరుతుంది. కార్పెట్ల యూనిట్‌కు కొత్త యంత్రాలు కార్పెట్ల తయారీ యూనిట్‌కు కొత్త యంత్రాలు వచ్చాయి. ఇంతవరకు ఇక్కడ 6 యంత్రాలుండేవి. ఇటీవల మరో 8 యంత్రాల(మగ్గాలు)ను అధికారులు ఇక్కడకు తీసుకొచ్చారు. దీంతో వాటి ఉత్పత్తి పెరిగింది. ఆరు యంత్రాలపై తయారైన కార్పెట్లు ఇక్కడ ఖైదీలకు చాలక గతంలో వరంగల్ జైల్ నుంచి కొనుగోలుచేసి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఇక్కడే అధికంగా ఉత్పత్తి చేసి రాష్ట్రంలోని మిగిలిన కారాగారాలకు సరఫరా చేస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా నెలకు 150 కార్పెట్లు ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 28 మంది ఖైదీ లు పనిచేస్తున్నారు. ఖైదీలలో పరివర్తన కోసమే... ఖైదీలలో పరివర్తనం కోస మే ఇక్కడ పరిశ్రమలు ప్రారంభించాం. తమ కుటుంబం ఎలా గడుస్తుం దోనని శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కుమిలిపోకుండా వారి లో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తున్నాం. అందుకోసమే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు సహాయకుల్ని ఆహ్వానిస్తున్నాం. ఓలం కంపెనీని తీసుకొచ్చాం. గతంలో స్టీల్‌ప్లాంట్ సహకారంతో కలర్ ప్రింటింగ్ మెషీన్ ఏర్పాటు చేశాం. వీటితో పాటు ఖైదీలలో ఉన్న కళలు బహిర్గతం చేయడానికి పలు అవకాశాలు కల్పిస్తున్నాం. చెక్కపని చేస్తూ బొమ్మల తయారీ చేసేవారికి, పెయింటింగ్ చేసేవారికి సహకారం అందిస్తున్నాం. వారి పనితనాన్ని బట్టి తగిన పారితోషికం అందజేస్తున్నాం. ఇక్కడ ఉన్న పరిశ్రమల నుంచి గత ఏడాది జైల్ సంక్షేమ నిధికి రూ.35,10,000ల ఆదాయం లభించింది. -ఇండ్ల శ్రీనివాస్, సూపరింటెండెంట్, కేంద్ర కారాగారం, విశాఖపట్టణం -
చిన్నపరిశ్రమలకు వైఎస్ పెద్దపీట
గెస్ట్ కాలం: ‘సగటు అభివృద్ధి రేటు ప్రకారం చూస్తే పరిశ్రమల సంఖ్య, పెట్టుబడులు, ఉపాధి విషయూల్లో తెలంగాణే అగ్రస్థానంలో ఉన్న విషయుం అర్థవువుతుంది. అలాగే 2004-09 వుధ్యకాలంలో సాధించిన పెరుగుదలను చూసినా కూడా తెలంగాణే మొదటి స్థానంలో ఉన్న సంగతి గవునించవచ్చు. తెలంగాణతో పోల్చితే కోస్తాంధ్రలో అభివృద్ధి ఆరుశాతం తక్కువ ఉంది.’ - వి.హనుమంతరావు ఆర్థిక విశ్లేషకులు తెలంగాణ అభివృద్ధిని నిరోధించిన నేతగా డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డిని చిత్రించి చూపడానికి కొందరు ప్రయుత్నించిన సంగతి తెలియునిది కాదు. వారి దృష్టిలో వైఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను చిదిమివేసిన వ్యక్తి. ఇది గోబెల్స్ ప్రచారం తప్ప వురొకటి కాదు. దేశంలో చిన్న, లఘు పరిశ్రవుల రంగం ఉత్పత్తుల విలువ 2001- 02 ధరల ప్రకారం రూ.4,71,700 కోట్లు. ఆ పరిశ్రవుల సంఖ్య 130 లక్షలు. వాటిలో పని చేసే వారి సంఖ్య 420 లక్షలు. వాటి ఎగువుతుల విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ.1,77,600 కోట్లు. తయూరీ రంగంలో జరిగే ఉత్పత్తుల్లో 45 శాతం, ఎగువుతుల్లో 40 శాతం చిన్న, లఘు పరిశ్రవులదే. పారిశ్రామికరంగాన్ని పరిశీలించేటపుడు పరి శ్రవుల సంఖ్య, పెట్టుబడి, వాటి ఉత్పత్తుల విలువ ఆధారంగా విశ్లేషిస్తారు. తెలంగాణ అనగానే హైదరా బాద్ నగరాన్ని మినహారుుస్తే మిగిలిన తెలంగాణ జిల్లాలన్నీ వెనుకబడే ఉన్నాయున్నది పలువురి నిశ్చితాభిప్రాయుం. అందుకే ఈ పరిశీలనను ఆంధ్ర, తెలంగాణ, సీవు అనే వుూడు ప్రాంతాలుగా కాకుండా హైదరాబాద్ నగరం ప్రభావం ఉన్న చుట్టు పక్కల ప్రాంతాలు రంగారెడ్డి, మెదక్, వుహబూ బ్‌నగర్ జిల్లాలను కలిపి ఈ ప్రాంతాన్ని హైదరా బాద్ నగర ప్రాంతంగా, మిగిలిన జిల్లాలు (ఆదిలాబాద్, నిజావూబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖవ్ముం) మిగిలిన తెలంగాణగా తీసుకోవడం జరిగింది. కోస్తా జిల్లాలను దక్షిణ కోస్తా గా, ఉత్తర కోస్తా ప్రాంతాలుగా, రాయులసీవు నాలుగు జిల్లాలను వురో ప్రాంతంగా పరిగణించి విశ్లేషించి, అభివృద్ధిని సగటు వార్షికాభివృద్ధి రేటు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం పరిశ్రవుల సంఖ్య, పెట్టుబడి, ఉద్యోగాల విష యూల్లో కోస్తాంధ్ర, రాయుల సీవుల కన్నా తెలంగాణ అగ్రస్థా నంలో ఉంది. (వుూడు ప్రాంతాల గ్రాఫ్ చూడండి... గణాంకాలు పరిశ్రవుల శాఖ ఇచ్చినవి). 2004-09 వుధ్య కాలంలో సాధించిన పెరుగుదలను చూసినా కూడా తెలంగాణే మొదటి స్థానంలో ఉంది. కోస్తాంధ్రలో అభివృద్ధి తెలంగాణలో జరిగిన అభివృద్ధి కన్నా ఆరు శాతం తక్కువగా ఉంది. తెలంగాణలో ఈ పెరుగుదల అంతా వైఎస్ వుుఖ్యవుంత్రిగా ఉన్న కాలంలోనే జరిగిందన్నది గవునార్హం. 2005లో సెజ్‌లు ఏర్పాటు చట్టం రూపొందింది. తరువాత 72 సెజ్‌లను రాష్ట్రంలో నోటిఫై చేయుగా, అందులో 44 సెజ్‌లు (61.1శాతం) తెలం గాణలోనే ఉన్నారుు. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నారుు. చిన్న, లఘు పరిశ్రవుల పనితీరును అధ్యయునం చేయుగా 1995-2009 వుధ్యకాలంలో 2007 - 08, 2008 - 09 సంవత్సరాల్లో ప్రశంసనీయుమైన అభివృద్ధి జరిగింది. 2007-08, 2008-09 సంవత్సరాల్లో హైదరాబాద్ ప్రాంతంలో 50.6, 41.9 శాతం, మొత్తం తెలంగాణ ప్రాంతంలో 44.8 శాతం, 38.3శాతం పెట్టుబడులు పెరిగారుు. ఆంధ్ర ప్రాంతంలో పెట్టుబడులు ఇంతకన్నా తక్కువే. ఆ పరిశ్రమల్లో 1995-2004 వుధ్యకాలంలో (చంద్రబాబు హయూంలో) పెట్టుబడులు రూ. 163కోట్ల నుంచి రూ. 4,452 కోట్లకు పెరగగా, ఆ తరువాత 2009 వుధ్యకాలంలో రూ. 10,504 కోట్లకు పెరిగారుు. ఇందుగలరందు లేరనే...! రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, పంచాయతీలు, స్థానిక సంస్థల్లో 1.2 లక్షలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా ఎనభైవేలకు పైగా తాత్కాలిక ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. ఇక ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖ, టూరిజం వంటి ప్రభుత్వ సంస్థల్లో దాదాపు లక్షా ముఫ్పై వేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఎన్‌ఎంఆర్‌లు, పార్ట్‌టైం ఉద్యోగులు, కంటింజెంట్ ఉద్యోగులు, క్యాజువల్ ఉద్యోగులు మరో 30 వేల మందికిపైగా ఉన్నారు. ప్రైవేటు రంగంలో కాలేజీల్లో 1.5 లక్షల మంది ఉన్నారు. ఇక హమాలీలు, కూలీలూ అసంఘటిత రంగంలోనే.. అది కష్టాల ‘కుప్ప’ం అది కుప్పం. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం. అక్కడ 25 వేల మంది అసంఘటిత కార్మికులు చలువరాళ్లు చెక్కుతారు. పిల్లా జెల్లా ముసలి ముతక కలిపి సుమారు లక్ష మంది జీవిస్తుంటారు. ఆ తెల్లరాయి ఎంతో కఠినమైంది. దాన్ని చెక్కే ఉలి మూణ్ణెళ్లలోనే సగం అవుతుందట. ఆ విరిగిన ఇనుప ముక్కలు కార్మికుల దేహాన్ని తూట్లు పొడుస్తాయి. కళ్లకు తగిలి చూపుపోయిన వారెందరో. వారికి వైద్యం చేయించుకునే దిక్కు లేదు. ఇజ్రాయెల్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం మోసుకొచ్చి కుప్పంలో వ్యవసాయం అభి వృద్ధి చేశానని చెప్పే చంద్రబాబుకు అదే కుప్పంలో చలువరాతి కొండల్లోని ‘బండ’ బతుకులు కనబడలేదెందుకో? ఆ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య సహా యం అందించాలని, కనీస వేతనాలు చెల్లించేలా చూడాలనే ఆలోచన ఏనాడూ రాలేదు... కారుచౌకగా కార్మిక శక్తి... అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులు దొరకడమే దుర్లభం. ఒకవేళ దొరికినా, వారిని నియమించుకుంటే వారికి చెల్లించాల్సిన జీతభత్యాలు తక్కువేమీ కాదు. ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లోని కంపెనీ లు తమ పనులను కార్మికశక్తి కారుచౌకగా దొరికే దేశాలకు ‘ఔట్‌సోర్స్’ చేస్తున్నాయి. తృతీయ ప్రపంచ దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను ఒక్కొక్క కార్మికునికి గంటకు చెల్లించే వేతనం డాలరు (రూ.60) కంటే తక్కువే. కార్మికశక్తి కారుచౌకగా దొరికే తొలి పది దేశాలు... 1. మడగాస్కర్ (0.18 డాలర్లు-రూ.10.77), 2. బంగ్లాదేశ్ (0.23 డాలర్లు-రూ.13.77), 3. పాకిస్థాన్ (0.32 డాలర్లు-రూ.19.17), 4. ఘనా (0.32-రూ.19.17), 5. వియత్నాం (0.39 డాలర్లు-రూ.23.36), 6. భారత్ (0.48 డాలర్లు-రూ.28.75), 7. కెన్యా (0.50-రూ.29.96), 8. సెనెగల్ (0.52-రూ.31.16), 9. శ్రీలంక (0.62 డాలర్లు-రూ.37.14), 10. ఈజిప్టు (0.80 డాలర్లు-రూ.47.94). కళ్లు చెదిరే కనీస వేతనాలు... అభివృద్ధి చెందిన పలు దేశాలు కార్మికులకు కళ్లు చెదిరే కనీస వేతనాలను చెల్లిస్తున్నాయి. వారి కనీస వేతనాల ముందు మన దేశంలో కాస్త పెద్ద ఉద్యోగాలు చేసే వారి జీతాలూ దిగదుడుపే. కార్మికులకు గంటకు అత్యధిక కనీస వేతనాలు చెల్లించే తొలి పది దేశాలు... 1. నార్వే (57.53 డాలర్లు-రూ.3446), 2. స్విట్జర్లాండ్ (53.20 డాలర్లు-రూ.3186), 3. బెల్జియం (50.70 డాలర్లు-రూ.3032), 4. డెన్మార్క్ (45.48 డాలర్లు-రూ.2720), 5. స్వీడన్ (43.81 డాలర్లు- రూ.2620), 6. జర్మనీ (43.76 డాలర్లు-రూ.2617), 7. ఫిన్లాండ్ (42.30 డాలర్లు-రూ.2531), 8. ఆస్ట్రియా (41.07 డాలర్లు-రూ.2457), 9. నెదర్లాండ్స్ (40.92 డాలర్లు-రూ.2448), 10. ఆస్ట్రేలియా (40.60 డాలర్లు-రూ.2429). -
చిన్న తరహా పరిశ్రమలకు హామీలేని రుణాలు
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలకు, వ్యాపారాలకు ఎలాంటి హామీ లేకుం డా రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు జాతీయ బ్యాంకులు రుణాలు అందజేస్తాయని చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ బీవీ రామారావు తెలిపారు. తాడేపల్లిగూడెంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ దీనికి సంబంధించి 60 ఏళ్ల తర్వా త రిజర్వు బ్యాంకు ఈ నెల 29న కాకినాడలో సమావేశం నిర్వహించనుందని వివరించారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజస్ పథకం కింద ఎలాంటి ష్యూరిటీలు, థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వేలాదిమంది ఈ పథకాన్ని వినియోగించుకొని లబ్ధిపొందారని తెలిపారు. ఔత్సాహికులు ప్రాజెక్టులతో తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. కాకినాడ ఆర్బీఐ సమావేశానికి బ్యాంకుల చీఫ్ మేనేజర్లు, ఆర్బీఐ రీజినల్ డెరైక్టర్ కేఆర్ దాస్ తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఖాయిలాపడిన పరిశ్రమలను తెరవాలనుకునేవారు ఈ నెల 27న హైద్రాబాద్‌లో జరిగే ఎంపవర్డ్, స్లీక్ కమిటీ సమావేశానికి హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు 98666 49369 ఫోన్ నంబరులో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.