2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం : బీజేపీ | 2019 Target BJP election win | Sakshi
Sakshi News home page

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం : బీజేపీ

Published Tue, Jun 7 2016 9:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

2019 Target BJP election win

సూర్యాపేట
 రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు  బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు నివాసంలో సోమవారం ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా విరివిగా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు.
 
  సమావేశంలో నెహ్రూ యువ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, పార్టీ నాయకులు ఎండీ హబీద్, నలగుంట్ల అయోధ్య, చల్లమల్ల నర్సింహ, బండపల్లి పాండురంగాచారి, రంగరాజు రుక్మారావు, కొణతం సత్యనారాయణరెడ్డి, కర్నాటి కిషన్, వుప్పల సంపత్‌కుమార్, జటంగి వెంకటేశ్వర్లు, జీడి భిక్షం, మంచాల రంగయ్య, పొదిల రాంబాబు, కిరణ్  పాల్గొన్నారు.
 
 బహిరంగ సభను జయప్రదం చేయాలి
 నల్లగొండ టూటౌన్ :సూర్యాపేటలో నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక బీజేపీ నేత పల్లెబోయిన శ్యాంసుందర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు అమిత్ షా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పోతెపాక సాంబయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లెబోయిన శ్యాంసుందర్, పెరిక మునికుమార్, వీరబాబు  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement