MLC Ramchander Rao
-
టీఆర్ఎస్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది: బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జుమ్మెరాత్ బజార్లో రాణి అవంతి విగ్రహ ఏర్పాటుపై బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై లాఠీచార్జ్ విధించారు. ఈ సంఘటనపై బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రామచంద్ర రావు అడిషినల్ డీజీపీ జితేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో రాణి అవంతి భాయి విగ్రహాలు అనేకం ఉన్నాయని, పోలీసులు కావాలనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దాడి చేశారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్ఐఎమ్తో దోస్తీ కట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుడా రాష్ట్రంలో బీజేపీని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యూమెరాత్ బజార్లో 2009 లోనే రాణి అవంతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, గడిచిన పది సంవత్సరాలలో మూడు సార్లు విగ్రహాన్ని మార్చారని మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నందుకు రేపు గోషామహల్ నియోజకవర్గంలో బంద్ నిర్వహిస్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని రామచంద్ర రావు స్పష్టం చేశారు. -
'కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణలో చేయాల్సింది చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై దుష్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ కేసీఆర్‌కు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని జలవివాదాలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు సూచించారు. -
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం : బీజేపీ
సూర్యాపేట రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు నివాసంలో సోమవారం ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా విరివిగా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. సమావేశంలో నెహ్రూ యువ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు, జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, పార్టీ నాయకులు ఎండీ హబీద్, నలగుంట్ల అయోధ్య, చల్లమల్ల నర్సింహ, బండపల్లి పాండురంగాచారి, రంగరాజు రుక్మారావు, కొణతం సత్యనారాయణరెడ్డి, కర్నాటి కిషన్, వుప్పల సంపత్‌కుమార్, జటంగి వెంకటేశ్వర్లు, జీడి భిక్షం, మంచాల రంగయ్య, పొదిల రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు. బహిరంగ సభను జయప్రదం చేయాలి నల్లగొండ టూటౌన్ :సూర్యాపేటలో నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక బీజేపీ నేత పల్లెబోయిన శ్యాంసుందర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు అమిత్ షా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పోతెపాక సాంబయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లెబోయిన శ్యాంసుందర్, పెరిక మునికుమార్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.