బుధవారం గజ్వేల్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ తదితరులు హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌కే సాధ్యమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ తదితరులు హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 2లక్షల రుణం, స్వయం సంఘాల మహిళలకు, రైతులకు లక్ష వరకు ఉన్న బ్యాంకు రుణాల మాఫీ, కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు కృషిచేస్తామన్నారు. తమ పార్టీకి నాలుగున్నరకోట్ల ప్రజలే హైకమాండ్ అని హరీష్‌రావు పేర్కొన్నారు. తాము ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు.
తెలంగాణలో టీడీపీ దుకాణం బందైపోయిందన్నారు. చివరి నిమిషం వరకు తెలంగాణను అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రల చేశారన్నారు. ఆంధ్రావారి నాయకత్వంలో వారి మోచేతి నీళ్లు తాగాల్సిన అగత్యం తెలంగాణ ప్రజలకు లేదని, టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గజ్వేల్ నగర పంచాయతీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, నాయకులు గాడిపల్లి భాస్కర్, నారాయణరెడ్డి, సురేష్‌గౌడ్, చేతిరెడ్డి లింగారెడ్డి, ఆకుల దేవేందర్, మద్ది రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.