సంగారెడ్డి క్రైం(మెదక్): తమ ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధిని చూసి కాంగ్రెస్, టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్ని కాంగ్రెస్, టీడీపీ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి విషయంలో ప్రోత్సహించాలని, విమర్శించడాన్ని వారి విచక్షణకే వదిలేస్తున్నామని చెప్పారు.
ఈ శిక్షణలో ఆస్కి సంస్థకు రూ.5 లక్షలు అడ్వాన్సుగా చెల్లించామని, అలాంటిది టీఆర్‌ఎస్ శిబిరంలో శిక్షణ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం వారి అవివేకానికి నిదర్శనమని చెప్పారు. ఎవరేమనుకున్నా తాము ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసమే పనిచేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు నచ్చిన కార్యక్రమాలపై విమర్శలు చేస్తే కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రజలకు దూరమవడం ఖాయమన్నారు.
'అభివృద్ధి కోసమే పనిచేస్తాం'
Published Tue, May 5 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement