
సమావేశంలో మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి
సంస్థాన్ నారాయణపురం: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితం వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో ఐదు నిరుపేద కుటుంబాలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన ఇళ్ల గృహ ప్రవేశం శనివారం జరిగింది.
ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కేసీఆర్ సర్వే చేయిస్తే.. రాజగోపాల్‌రెడ్డికి ప్రజల్లో మంచి పేరుందని తేలిందని, అందుకే మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని మునుగోడు నియోజకవర్గంలో తిప్పుతున్నాడన్నారు. రోడ్ల అభివృద్ధికి నిధులు తీసుకునిరా.. ఇళ్లులేని వారికి ఇళ్లు ఇప్పించు.. పింఛన్లు లేని వారి ఫింఛన్లు ఇప్పించు.. రేషన్ కార్డులు ఇవ్వు అని ఆయన మంత్రిని డిమాండ్ చేశారు. అవి నెరవేరిస్తే మంత్రిని గౌరవిస్తాం,. సన్మానం చేస్తామన్నారు. అభివృద్ధికి రూపాయి తీసుకురాకున్నా.. కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్ కార్డులు ఇచ్చేందుకు మంత్రి రావాలా? అని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment