నాయిని చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి
కవాడిగూడ(హైదరాబాద్): రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జీవితాంతం పేదలు, కార్మికుల పక్షాన పోరాడి గరీబోళ్ల లీడర్‌గా చెరగని ముద్ర వేశారని మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. నాయిని ప్రథమ వర్ధంతిని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సుభాష్‌రెడ్డి, సాయన్న, ఎమ్మెల్సీ ప్రభాకర్, ప్రొటెం స్పీకర్ భూపాల్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్, నాయిని కుటుంబసభ్యులు, బంధువులు, టీఆర్‌ఎస్ నేతలు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు
పేదలకు విద్య, వైద్యసేవలు అందించేందుకుగాను నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్‌ను ఆయన కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ లోగోను మహమూద్ అలీ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 45 అంగన్‌వాడీ సెంటర్లకు కార్పెట్ల ను అందజేశారు. ఫౌండర్‌గా సమతారెడ్డి, వైస్ చైర్మన్‌గా నాయిని దేవేందర్‌రెడ్డి కొనసాగుతారు.
Comments
Please login to add a commentAdd a comment