![Press Meet Of Ap And Telangana Ministers On Telugu States Cms Meeting](/styles/webp/s3/article_images/2024/07/6/Bhatti.jpg.webp?itok=HysIoJqQ)
సాక్షి, హైదరాబాద్: విభజన సమస్యలపై లోతుగా చర్చించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై చర్చించామని.. రెండు కమిటీలు వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఏపీ, తెలంగాణ మంత్రులు ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాలకు చెందిన సమస్యల పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేశాం. సీఎంల భేటీలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. సమస్యల పరిష్కారం కోసం సీఎస్‌లతో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని నిర్ణయించాం’’ అని చెప్పారు.
‘‘మంత్రులతో కూడిన మరో కమిటీ వేయాలని నిర్ణయించాం. 2 వారాల్లోగా త్రీమెన్ కమిటీ కొన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. అనంతరం రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ వేస్తాం. డ్రగ్స్‌ను నియంత్రించడానికి రెండు రాష్ట్రాలు ముందుకు వెళ్లాలని నిర్ణయించాం’’ అని భట్టి విక్రమార్క అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment