ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి | A special focus on public schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి

Published Tue, Oct 28 2014 11:37 PM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

A special focus on public schools

పటాన్‌చెరు రూరల్: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ సహిత మరుగుదొడ్లు నిర్మిస్తామని  విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలి పారు. మంగళవారం ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మండలంలోని ఇస్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో, గీతం విశ్వవిద్యాలయం సహకారంతో రుద్రారం గ్రామంలో నిర్మించిన పర్యావరణ సహిత మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం 70 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవనీ, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

అందువల్ల రానున్న రోజుల్లో తక్కువ ఖర్చుతోనే నిర్మించే పర్యావరణ సహిత మరుగుదొడ్ల నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. పర్యావరణ సహిత మరుగుదొడ్ల నిర్మాణంలో గీతం విద్యార్థులు చేస్తున్న పరిశోధనలను అభినందించారు.  మంత్రి వెంట ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారి వేణుగోపాలాచారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, ఈఈ చెన్నారెడ్డి, డిప్యూటీ ఈఈ రామకష్ణ, ఏఈ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు, తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీఓ అనంతరెడ్డి, ఇస్నాపూర్ సర్పంచ్ విజయలక్ష్మి, రుద్రారం సర్పంచ్ నవసుకుమారి, గీతం విశ్వవిద్యాలయం డెరైక్టర్ వర్మ ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement