జైపూర్: కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక విజయం నయా జోష్‌ను నింపింది. ఇదే ఊపుతో రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం దిశగా అడుగులు వేయాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. వర్గపోరుకు చెక్ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సైతం అక్కడి ఫార్ములానే అన్వయింపజేస్తోంది.
తాజాగా సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య నెలకొన్న రాజకీయ వైరాన్ని చెరిపేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకు వేసింది కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మరో కీలకమైన ఎన్నికల హామీని ప్రకటించింది గెహ్లట్ సర్కార్. అదే ఉచిత విద్యుత్.
రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్‌ను సిబ్సిడీ కింద అందిస్తామని సీఎం గెహ్లాట్ కిందటి ఏడాది డిసెంబర్‌లో ప్రకటించారు. ఇక ఇప్పుడు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు. అంతేకాదు.. వంద యూనిట్ల తర్వాత స్లాబ్‌ల వారీగా ఫిక్స్‌డ్ రేటు ఉంటుందని బుధవారం సాయంత్రం గెహ్లట్ ప్రకటన చేశారు. ఈ హామీలకు అదనంగా.. రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులపై శాశ్వత ఛార్జీలు, ఇంధన సర్‌చార్జిని మాఫీ చేస్తుందని ఆయన ప్రకటించారు.
महंगाई राहत शिविरों के अवलोकन व जनता से बात करने पर फीडबैक आया कि बिजली बिलों में मिलने वाली स्लैबवार छूट में थोड़ा बदलाव किया जाए.
— Ashok Gehlot (@ashokgehlot51) May 31, 2023
- मई महीने में बिजली बिलों में आए फ्यूल सरचार्ज को लेकर भी जनता से फीडबैक मिला जिसके आधार पर बड़ा फैसला किया है.
-
- 100 यूनिट प्रतिमाह तक बिजली… pic.twitter.com/z27tJRuyaf
కర్ణాటక విజయంలో ఉచిత విద్యుత్ హామీ కూడా కీలక పాత్ర పోషించింది. అందుకే దీనిని హైలైట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని గెహ్లట్ సర్కార్ భావిస్తోంది. అంతకు ముందు ఢిల్లీ, పంజాబ్‌లోనూ ఆప్ ఇలా ఫ్రీ ఎలక్ట్రిసిటీ హామీతోనే అధికారాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో బీజేపీ సైతం ఎన్నికల సమరానికి కసరత్తులు ప్రారంభించింది. తాజాగా అజ్మీర్‌లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. గెహ్లట్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు సంధించారు. అవినీతి, గ్రూపు రాజకీయాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇదీ చదవండి: యావత్ దేశం మనోభావాల్ని కాంగ్రెస్ కించపరిచిందా?
Comments
Please login to add a commentAdd a comment