ముదుసలి వయసులో నడవలేక.. చూపు సరిగా కానరాక.. కన్నబిడ్డల సహకారం అందక నిట్టూర్పులిడిచే వృద్ధులకు దిక్కెవరు? అందుకే ప్రభుత్వమే వారిని ఆదుకోవాలి. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితి అత్యంత దుర్భరం. వారికి నెలకు కేవలం రూ.70 పింఛన్ లభించేది. అది కూడా అతి తక్కువ మందికి. ఇక నడవలేని వికలాంగులు.. ఇతర వైకల్యంతో బాధపడేవారికి ఏమాత్రం భద్రత ఉండేది కాదు. ఈ పరిస్థితుల్ని వైఎస్ సమూలంగా మార్చారు. వృద్ధులకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున ప్రతి నెలా సమర్థవంతంగా అందించారు. ప్రస్తుతం జిల్లాలో 2,84,154 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు.
1,60,789 మంది వృద్ధులు.. చేనేతలు 6,636 మంది, వితంతువులు 70,023 మంది, అభయహస్తం కింద 17,659 మంది నెలకు రూ.200 చొప్పున పింఛన్ అందుకుంటున్నారు. వికలాంగులు రూ.500 తీసుకుంటున్నారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే వీరందరి జీవితాల్లో వెలుగులు నింపుతామని జగన్ హామీ ఇచ్చారు.
వారికి ఆయన చేయదలచుకుంది...
వికలాంగులకు రూ.1000, ఇతర సామాజిక పింఛనుదారులకు రూ.700 చొప్పున పింఛను మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల వంటివారు ఆయన్ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు.
పడిగాపుల విధానం పోవాలి
అందుకే వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్
అధిక ధర చెల్లించి కొనుక్కున్న విత్తనాలు.. ఆకాశాన్నంటిన ఎరువులు, పురుగుమందులు.. విపరీతంగా పెరిగిన కూలి రేట్లు.. అయినా అన్నదాత అప్పు చేసి మరీ వ్యవసాయానికి సిద్ధమవుతాడు. వరుణ దేవుడు కరుణించకపోయినా.. భూమాత అయినా కాపాడుతుందిలే అనుకొని నాట్లు వేస్తాడు. కానీ ఏం లాభం. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే పొలం దగ్గర కాపలా కాయాలి.
వైఎస్ మరణానంతరం రైతులు అనుభవిస్తున్న వ్యధలివి. ప్రస్తుత పాలకులు వైఎస్ హామీని గాలికి వదిలేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా.. కరెంటు తీగలు వేళ్లాడుతున్నా అధికారులు చలించలేదు. ఈ పరిస్థితులు మార్చేందుకు జగన్ నడుం బిగించారు.
ప్రస్తుతం జిల్లాలో 115652 మంది రైతులు ఉచిత విద్యత్ లబ్ధిదారులుగా ఉన్నారు. కానీ వీరంతా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన.. ఎటువంటి ఆటంకాలు లేకుండా 9 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తామని జగన్ వెల్లడించారు.
అందుకే తిరిగి రాజన్న రాజ్యం రాకపోదా అన్న ఆశాభావంతో రైతన్నలున్నారు.
108 సేవలు సరిపోతున్నాయా?
ఎక్కడైనా ప్రమాదం జరిగితే.. వైఎస్‌కు పూర్వం పరిస్థితులు ఎలా ఉండేవో గుర్తున్నాయా? క్షతగాత్రులు బతికే అవకాశం ఉన్నా.. ప్రైవేటు వాహనాలు సకాలంలో దొరికేవి కాదు.. ఆస్పత్రుల్లో వెంటనే చేర్చుకొనేవారు కాదు.. ఫలితంగా విలుైవె న ప్రాణాలు అన్యాయంగా పోయేవి. ఈ విధానాన్ని మార్చేందుకు దివంగత నేత వైఎస్ 108 ప్రవేశపెట్టారు. దానివల్ల జరిగిన లాభం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అంబులెన్స్ సేవలు మసకబారుతున్నాయి. వాహనంలో వెంటిలీటర్లు లేక చాలా మంది చనిపోతున్నారు.
ఈ విధానాన్ని మార్చేందుకు జగన్ సమాయత్తమవుతున్నారు. 108ని పూర్తిగా ఆధునీకరిస్తానన్నారు.
అంతేకాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రోల్‌మోడల్‌లా తీర్చిదిద్దుతామని స్పష్టం చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వస్తోంది స్వర్ణయుగం
Published Mon, Feb 10 2014 3:38 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement