న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు తన ఆరు వాగ్దానాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల ముందుంచారు. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వంటివి వీటిలో ఉన్నాయి. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన ప్రతిపక్షాల మెగా ర్యాలీలో ఎన్నికల వాగ్దానాలతో కూడిన కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు.
ఆరు గ్యారంటీలు ఇవే..
- అంతరాయం లేని విద్యుత్
- ఉచిత కరెంటు
- విప్లవాత్మక విద్య
- యూనివర్సల్ హెల్త్‌కేర్
- రైతులకు గిట్టుబాటు ధరలు
- ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా
“ప్రియమైన భారతీయులారా, మీరందరికీ నా శుభాకాంక్షలు. నేను ఓట్లు అడగడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎవరినీ ఓడించడం గురించి మాట్లాడడం లేదు. దేశాన్ని నవభారతంగా మార్చడం గురించి మాట్లాడుతున్నాను. మన దేశానికి అన్నీ ఉన్నాయి. నేను జైల్లో ఉన్నాను. దేశం గురించి ఆలోచించడానికి ఇక్కడ నాకు చాలా సమయం దొరికింది. భారతమాత బాధలో ఉంది. పిల్లలకు మంచి చదువులు ఉండడం లేదు. ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. కరెంటు కోతలు, అధ్వాన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు" అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment