
సాక్షి, తాడేపల్లి : ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన..కరెంట్ చార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని, ఆయన అబద్ధాలకు అంతే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ ఇస్తామని ఆనాడు రాజశేఖర్ రెడ్డి అంటే కరెంట్ తీగలు మీద బట్టలు అరేసుకోవలని అవహేళనగా మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది కాదా అని నిలదీశారు. (నూతన్ నాయుడు అరెస్టు: విశాఖకు తరలింపు)
రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం రెండవ స్థానంలో ఉందన్నది అబద్ధమని తెలిపారు. ఉచిత విద్యుత్‌పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని, టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని కన్నబాబు సవాల్ విసిరారు. మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకం ఉచిత విద్యుత్. రైతుల కోసం రైతులు కోసం రాజశేఖర్ రెడ్డి ఒకడుగు ముందుకు వేస్తే జగన్‌మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేశారు. ఉచిత విద్యుత్ కోసం రైతు ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు. నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది అని కన్నబాబు పేర్కొన్నారు. (కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు)