సాక్షి, సిద్దిపేట: టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డుకునిజమైన వారసుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం సిద్దిపేట లోని రాఘవపూర్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలి పోయే మోటార్లు ఉండేవని గుర్తు చేశారు.
గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని, కరెంట్ చార్జీలు తగ్గించమని పోరాడిన రైతులను కాల్చి చంపాడని మండిపడ్డారు. శిష్యుడు రేవంత్‌రెడ్డి కూడా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నాడని విమర్శించారు. ‘ఓ కాంగ్రెస్ నాయకుడు ఉచిత కరెంట్ వద్దంటాడు, ఒకరు మూడు గంటలు చాలు, మరొకరు ఎనిమిది గంటలు చాలంటాడు. వారంతా సోయి లేకుండా మాట్లాడుతున్నారు’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాంటి నాయ కులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. మూడు గంటల కరెంట్ అందించే పార్టీ కావాలా.. మూడు పంటలకు 24 గంటల ఉచిత కరెంట్ అందించే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగాలో రైతులు ఆలోచించాలని మంత్రి కోరారు.
సమ్మె వీడి.. విధుల్లో చేరండి..
గ్రామ పంచాయతీ కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని హరీశ్‌రావు కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే రూ.వెయ్యి వేతనాన్ని పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికీ సీఎం కేసీఆర్ పరిశీలనలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భరోసా ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్మికులతో చర్చలు జరిపి వీలైనంత త్వరగా సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment