సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ రాక ముందు దారుణ పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థాయికి చేరిందని సీఎం కేసీఆర్ అన్నారు. హుస్నాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు కరెంట్ కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి అప్పుడు ఉండేదని, ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ ఉందన్నారు.
‘‘పచ్చదనం, పారిశుధ్యంలో తెలంగాణ నెంబర్ వన్. వలసలు, కరెంట్ కోతలతో ఇబ్బంది పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా ఉందో ఆలోచించండి. పారిశ్రామిక విధానంలో మనమే నంబర్‌వన్‌గా ఉన్నాం. ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అన్నీ పూర్తి చేసుకున్నాం. ఎన్నికలొస్తే పార్టీలు ఏవేవో మాట్లాడుతుంటాయి’’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు.
‘‘పెన్షన్లు ఎందుకివ్వాలని ఆలోచించాం. పనిచేసుకోలేని వారికి అండగా నిలచే ఉద్దేశంతోనే పెన్షన్లు ఇస్తున్నాం. ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆర్థిక భరోసా కోసమే పెన్షన్లు
ఓట్ల కోసం పెన్షన్లు ఇస్తామని ఎప్పుడూ మేం చెప్పలేదు. దశల వారీగా పెన్షన్లు పెంచుకుంటూ వస్తాం. ఓట్ల కోసం పెన్షన్లు ఇస్తామని ఎప్పుడూ మేం చెప్పలేదు. రైతు బంధుతో అన్నదాతలకు అండగా ఉంటున్నాం. రైతుబంధు సాయం ఇంకా పెంచాలని నిర్ణయించాం’’ సీఎం తెలిపారు.
‘‘ఒక్కొక్క ప్రాజెక్టునూ పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రైతు ఇవాళ కంటి నిండా నిద్ర పోతున్నాడు. మిషన్ భగీరథ లాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఆడబిడ్డ బిందె పట్టుకుని రోడ్డు మీద నిలబడే పరిస్థితికి ముగింపు పలికాం. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది. రాయి ఏంటో, రత్నమేదో గుర్తించి ఓటువేయాలి. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారు’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
చదవండి: బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే..
Comments
Please login to add a commentAdd a comment