సాక్షి, సిద్దిపేట: ‘రాష్ట్రంలో బీజేపీ బిచాణా ఎత్తేసింది.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలంటోంది’అని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బీజేపీ జమిలిని నమ్ము కుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జనాలను నమ్ముకు న్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్ కార్యకర్తలతో జరిగిన సభలో మాట్లాడారు. ఇండియా–పాకిస్తాన్, హిందూ – ముస్లింల మధ్య కొట్లాట పెట్టి బీజేపీ ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని విమర్శించారు.
నల్లాలు ఇచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలా? నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా? అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ తిట్లలో పోటీపడితే.. తెలంగాణ ప్రభుత్వం కిట్లతో పోటీ పడుతోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. తిట్లు కావా లంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని, కిట్లు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబా ద్‌లో నిర్వహి స్తున్నందుకు స్వాగతిస్తున్నాం.. తెలంగాణలో అమ లవుతున్న పథకాలను మీ ప్రాంతాల్లో ప్రవేశపెట్టి అమలు చేయండి’అని కాంగ్రెస్‌కు హితవు పలి కారు.
ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చే కాంగ్రెస్ నేత లకు సూచించారు. కాంగ్రెస్ ప్రకటించే డిక్లరేషన్లను ఆ పార్టీ అ«ధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చీప్ ట్రిక్కులకు, మాయమాటలకు ప్రజలు మోసపోవ ద్దన్నారు.
తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ మూడోసారి సీఎంగా హ్యాట్రిక్ కొట్ట డం ఖాయం అని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment