ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.. ధైర్యముంటే పేరు మార్చండి..  | Arvind Kejriwal Dare Challenge To BJP Amid Name Change Row | Sakshi
Sakshi News home page

ధైర్యముంటే దేశం పేరు మార్చి చూడండి.. కేజ్రీవాల్ సవాల్.. 

Published Sat, Sep 16 2023 7:36 PM | Last Updated on Sat, Sep 16 2023 9:06 PM

Arvind Kejriwal Dare Challenge To BJP Amid Name Change Row - Sakshi

రాయ్‌పూర్‌: త్వరలో జరుగనున్న ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశం పేరు మార్పు విషయమై సొంత నిర్ణయాలేంటని ప్రశ్నిస్తూనే ఇటీవల అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భద్రతా దళాలు మృతిచెందినా స్పందించకపోవడంపై ఘాటుగా విమర్శించారు. 

దమ్ముంటే పేరు మార్చండి.. 
ఛత్తీస్‌గఢ్‌లోని లాల్‌బాఘ్ మైదానంలో జరిగిన బహిరంగసభలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇండియా మీ నాన్నగారిది అనుకుంటున్నారా? ఇండియా 140 కోట్ల భారతీయులది. ఇండియా భారతీయుల గుండెల్లో ఉంది. హిందుస్థాన్ భారతీయుల గుండెల్లో ఉందని ధైర్యముంటే దేశం పేరు మార్చి చూడమని సవాల్ విసిరారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వం గతేడాది ఇండియా పేరుమీద అనేక కార్యక్రమాలను జరిపిందని గుర్తుచేశారు. 

నోరు విప్పరేం?
ఇక అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత సైనికులు మృతిచెందారు. వారి కుటుంబాన్ని చూసి యావత్ దేశమంతా తల్లడిల్లింది కానీ భారత ప్రధానికి కొంచెమైనా బాధ కలగలేదా అని ప్రశ్నించారు. వారు చనిపోయి నాలుగు రోజులు కావస్తున్నా ఇంతవరకు నోరువిప్పలేదే అని ప్రశ్నించారు. 

విద్యకే ప్రాధాన్యత.. 
ఛత్తీస్‌గఢ్‌లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే మా ప్రధాన లక్ష్యమని చెబుతూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా విద్య గురించి మాట్లాడింది లేదు. కానీ మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం      విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించి పేదరికాన్ని నిర్మూలించడమే మా సంకల్పమని అన్నారు.    

300 యూనిట్లు ఫ్రీ.. 
అంతకుముందు రాయ్‌పూర్‌లో జరిగిన బహిరంగసభలో ఛత్తీస్‌గఢ్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నగరాల్లోనూ గ్రామాల్లోనూ 24 గంటలూ విద్యుత్ అందిస్తామని హామీనిచ్చారు అరవింద్ కేజ్రీవాల్.    

ఇది కూడా చదవండి: 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement