Bharat vs India: ‘ఇండియా’ కూటమి పేరు మార్చితే ఏం చేస్తారు? | Bharat vs India: What Arvind Kejriwal On India Name Change Buzz | Sakshi
Sakshi News home page

Bharat vs India: ‘ఇండియా’ కూటమి పేరు ‘భారత్‌’గా మార్చితే ఏం చేస్తారు? సీఎం కేజ్రీవాల్‌ ప్రశ్న!

Published Tue, Sep 5 2023 6:43 PM | Last Updated on Tue, Sep 5 2023 7:43 PM

Bharat vs India: What Arvind Kejriwal On India Name Change Buzz - Sakshi

ఇండియా పేరు మార్పు వివాదం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశం కేంద్రలోని అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య పరస్పర తీవ్ర ఆరోపణలకు కేంద్రబిందువుగా మారింది. జీ20 సదస్సు కోసం విచ్చేస్తున్నదేశ, విదేశీ నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  అందించిన ఆహ్వాన పత్రాలపై ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ బదులు ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ పేరు’ అని ముంద్రించి ఉండటంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.

ఇప్పటికే ఇండియా పేరును మార్చాలంటూ కొన్ని రోజులుగా ఓ వర్గం డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పరిణామంతో త్వరలోనే కేంద్రం దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశానికి భారత్‌ పేరు పెట్టే కీలక బిల్లులకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  వచ్చే ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు మోదీ సర్కార్‌ యోచిస్తోంది. అయితే ఇండియా కూటమికి చెక్‌ పెట్టేందుకు మోదీ సర్కార్‌ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 

ప్రతిపక్షాల విమర్శలు..
ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్‌ను ఓడించే లక్ష్యంతో ఏర్పడిన ఈ కూటమిలో 28 పార్టీలు  ఉన్నాయి. దీంతో . ఇండియాను భారత్‌గా మార్చడాన్ని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పేరు మార్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. విపక్ష కూటమికి భయపడి, కేవలం ఎ‍న్నికల స్టంట్‌ కోసమే మోదీ సర్కార్‌ దేశం పేరు మార్చేందకు ప్రయత్నిస్తుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. 

కూటమికి మోదీ భయపడ్డారు.
ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇండియాపేరు భారత్‌గా అని మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. విపక్షాలన్నీ కలిసి ఏర్పడిన కూటమికి ఇండియా అని పేరును పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ భయపడ్డారని విమర్శించారు. ఈ క్రమంలోనే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా  మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అదే ఒక వేళ.. విపక్ష కూటమి పేరును ఇండియా నుంచి భారత్ అని మార్చితే అప్పుడు ఇండియా పేరును బీజేపీగా మారుస్తుందని సెటైర్లు వేశారు.
చదవండి: ఇండియా పేరు మార్పుపై సోషల్‌ మీడియాలో రచ్చ.. బిగ్‌బీ, సెహ్వాగ్‌, మమతా ట్వీట్లు

ఇండియా కూటమి పేరు భారత్‌గా మార్చితే?
ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  దేశం పేరును మార్చుతున్నట్లు తమకు అధికారిక సమాచారం లేదని అన్నారు. బీజేపీని వ్యతిరేచించే చాలా ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి ‘ఇండియా’గా పేరు పెట్టుకున్నందుకు  కేంద్రం దేశం పేరును మార్చుతోందా అని ప్రశ్నించారు.  దేశం 140 కోట్ల ప్రజలదని, ఒక పార్టీకి సంబంధించినది కాదని అన్నారు.  ఒకవేళ విపక్ష కూటమి పేరును భారత్‌గా మారితే.. దేశం పేరును భారత్ నుంచి బీజేపీగా మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విపక్ష కూటమి పేరును ఇండియా అని పెట్టుకోవడంతో బీజేపీ ఆందోళనలో ఉందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశం పేరు మార్చడం  ద్రోహమని మండిపడ్డారు. విపక్ష కూటమి వల్ల బీజేపీలో ఏదో తెలియని కలవరం నెలకొందని.. అందుకే ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement