ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి మీటింగ్‌కు గంటల ముందు ఈ సమావేశం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు.
డిసెంబర్ 19 (మంగళవారం)న న్యూఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష కూటమి మొదటిసారి సమావేశం కానుంది. డిసెంబర్ 20న బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధానితో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ భేటీ కానున్నారు. కేంద్రం నుంచి పశ్చిమ బెంగాల్‌కు పెండింగ్‌లో ఉన్న నిధుల అంశంపై ఆమె చర్చించనున్నారు.
ఇండియా కూటమి భేటీ మొదట డిసెంబర్ 6న నిర్ణయించారు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా కీలక నేతలు గౌర్హాజరు కారణంగా డిసెంబర్ 17కు వాయిదా వేశారు. డిసెంబర్ 17న కూడా వివిధ కారణాలతో మరోమారు ఇండియా కూటమి భేటీ వాయిదా పడింది. డిసెంబర్ 19న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కావునా రేపు ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు భేటీ అవుతున్నారు.
ఇదీ చదవండి: Delhi Liquor Scam Case: కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
Comments
Please login to add a commentAdd a comment