పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష ఇండియా కూటమితో జత కడతారా లేదా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగిన మమత ఎన్నికల తర్వాత విపక్షాల కూటమి ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కాబోనని ముందుగానే ప్రకటించారు.
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశంపై తాను తీసుకున్న నిర్ణయానికి లోక్‌సభ ఎన్నికలు, రెమాల్ తుపాను కారణాలని పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆమె లోక్‌సభ ఎన్నికల చివరి విడత ఓటింగ్, రెమాల్ తుపాను అనంతరం చేపడుతున్న సహాయక చర్యల కారణంగా జూన్ ఒకటిన జరిగే కూటమి మీటింగ్‌కు హాజరు కాలేనన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జూన్ ఒకటిన ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, దీనికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఒకవైపు తుఫాన్, మరోవైపు ఎన్నికలు ఈ నేపధ్యంలో తాను వీటిని విస్మరించి, సమావేశానికి ఎలా హాజరుకాగలను అని అని ప్రశ్నించారు.
మమత సమాధానంపై స్పందించిన బీజేపీ నేతలు.. కూటమి నుంచి తప్పించుకునేందుకే మమత ఇలాంటి సాకులు చూపుతున్నారని ఆరోపించారు. కాగా ఎన్నికల ఫలితాలకు ముందు మమతా బెనర్జీ బహిరంగంగా ప్రతిపక్ష శిబిరంతో సహవాసం చేయకూడదని భావించివుంటారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక, అప్పటి సీట్ల సంఖ్యను అనుసరించి ఆమె ఇండియా కూటమిలో చేరాలని అనుకుంటున్నారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల చివరి దశలో అంటే జూన్ ఒకటిన పశ్చిమ బెంగాల్‌లోని తొమ్మిది స్థానాలకు ఓటింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment