Lalbagh
-
ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.. ధైర్యముంటే పేరు మార్చండి..
రాయ్‌పూర్: త్వరలో జరుగనున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశం పేరు మార్పు విషయమై సొంత నిర్ణయాలేంటని ప్రశ్నిస్తూనే ఇటీవల అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భద్రతా దళాలు మృతిచెందినా స్పందించకపోవడంపై ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే పేరు మార్చండి.. ఛత్తీస్‌గఢ్‌లోని లాల్‌బాఘ్ మైదానంలో జరిగిన బహిరంగసభలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇండియా మీ నాన్నగారిది అనుకుంటున్నారా? ఇండియా 140 కోట్ల భారతీయులది. ఇండియా భారతీయుల గుండెల్లో ఉంది. హిందుస్థాన్ భారతీయుల గుండెల్లో ఉందని ధైర్యముంటే దేశం పేరు మార్చి చూడమని సవాల్ విసిరారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వం గతేడాది ఇండియా పేరుమీద అనేక కార్యక్రమాలను జరిపిందని గుర్తుచేశారు. ये 140 करोड़ लोगों का INDIA🇮🇳 है हम सबका INDIA है भारत, इंडिया, हिंदुस्तान - किसी की हिम्मत नहीं कि हमारे देश का नाम बदले। pic.twitter.com/c2gtVTgOJU — Arvind Kejriwal (@ArvindKejriwal) September 16, 2023 నోరు విప్పరేం? ఇక అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత సైనికులు మృతిచెందారు. వారి కుటుంబాన్ని చూసి యావత్ దేశమంతా తల్లడిల్లింది కానీ భారత ప్రధానికి కొంచెమైనా బాధ కలగలేదా అని ప్రశ్నించారు. వారు చనిపోయి నాలుగు రోజులు కావస్తున్నా ఇంతవరకు నోరువిప్పలేదే అని ప్రశ్నించారు. शर्मनाक ‼️ ◆ जब हमारे Army Officers शहीद हुए तब PM, गृहमंत्री और रक्षा मंत्री जश्न मना रहे थे ◆ उनको शहीद हुए 4 दिन हो गए लेकिन PM ने उनके दुख में 2 शब्द नहीं बोले ◆ हर बात पर ट्वीट करने वाले PM और गृह मंत्री इस पर चुप क्यों हैं? क्या आपको दुख नहीं होता?@ArvindKejriwal pic.twitter.com/eOn69skBbT — Ghanendra Bhardwaj🇮🇳 (@GhanendraB) September 16, 2023 విద్యకే ప్రాధాన్యత.. ఛత్తీస్‌గఢ్‌లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే మా ప్రధాన లక్ష్యమని చెబుతూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా విద్య గురించి మాట్లాడింది లేదు. కానీ మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించి పేదరికాన్ని నిర్మూలించడమే మా సంకల్పమని అన్నారు. VIDEO | "Since 75 years of independence, no party or government has ever come and asked for votes to build schools and hospitals. Even after the AAP came into existence, they still don't say this. They have a bad intent," says Delhi CM @ArvindKejriwal addressing a rally in… pic.twitter.com/Z49xoqpqHd — Press Trust of India (@PTI_News) September 13, 2023 300 యూనిట్లు ఫ్రీ.. అంతకుముందు రాయ్‌పూర్‌లో జరిగిన బహిరంగసభలో ఛత్తీస్‌గఢ్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నగరాల్లోనూ గ్రామాల్లోనూ 24 గంటలూ విద్యుత్ అందిస్తామని హామీనిచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఇది కూడా చదవండి: 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్! -
ఘనంగా నాడ ప్రభు జయంతి
బెంగళూరు(బనశంకరి) : నాడప్రభు కెంపేగౌడ జయంతి సంబరాలను శనివారం ఉదయం బృ హత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీ ఎంపీ) కార్యాలయం ముందు ఉన్న కెంపేగౌడ విగ్రహానికి మాలార్పణ చేయడం ద్వారా మేయర్ శాంతకుమారి ప్రారంభించారు. ప్రతి ఏటా కరగ మూడవరోజున కెంపేగౌడ జయంతిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మేక్రిసర్కిల్, సుంకేనహళ్లి, కోరమంగళ, లాల్‌బాగ్‌లో ఉన్న నాలుగు దిక్కుల సరిహద్దు గోపురాలకు ఆయా ప్రాంతాల స్థానిక కార్పొరేటర్లు నేతృత్వంలో కెంపేగౌడ జ్యోతిని తీసుకువచ్చి కేంద్ర కార్యాలయానికి చేరుకోగా మేయర్ శాంతకుమారి జ్యోతిని స్వీకరించారు. కెంపేగౌడ జ్యోతిని వివిధ జానపద కళాబృందాలతో నాటి వైభవాన్ని చాటుతూ నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీబీఎంపీ కేంద్ర కార్యాలయ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. -
లాల్‌బాగ్‌లో 144 సెక్షన్ విధింపు
ముంబై: మూడు రోజుల క్రితం రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన లాల్బాగ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నలుగురు కంటే ఎక్కువగా జనం గుమికూడకుండా చూసే ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 17వ తేదీ వరకు అమలులో ఉంటాయని స్థానిక బోయివాడ పోలీసు ఇన్స్పెక్టర్ సునీల్ తోండ్వాల్కర్ చెప్పారు. శాంతి భద్రతలు స్థిరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం ఇక్కడి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతను సృష్టించింది. జనం రాళ్లు రువ్వుకోవడం, పరస్పరం దాడులకు పాల్పడటంతో ఏడుగురు గాయపడిన సంగతి తెల్సిందే. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితులు రెండు గంటల్లో అదుపులోకి వచ్చాయి. సోమవారం, మంగళవారం కూడా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నా ఉద్రిక్తంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించినట్లు మారియా చెప్పారు. వదంతులు నమ్మవద్దని నగర పోలీసు శాఖ ద్వారా పౌరుల మొబైల్ ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపించారు. కొందరు యువకులు ఆ రోజు రికార్డు చేసిన ఘర్షణ దృశ్యాలను తమ బంధువులకు, మిత్రులకు ఎమ్మెమ్మెస్ చేసినట్టు తెలియవచ్చింది. ఉద్రిక్తతకు దారితీసే ఇలాంటి దృశ్యాలు ఎమ్మెమ్మెస్గాని, ఫేస్బుక్లోగాని, వాట్స్ అప్లోగాని పెట్టవద్దని రాకేశ్ మారియా విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు ఆజ్యం పోసే ఇలాంటి దృశ్యాలను అడ్డుకునేందుకు పోలీసు శాఖకు చెందిన సోషల్ మీడియా కూడా ప్రయత్నిస్తోందని కమిషనర్ చెప్పారు. లాల్బాగ్ నుంచి పరేల్‌లోని తకియా మసీదు ప్రాంతం వరకు మంగళవారం రాత్రంతా మారియా స్వయంగా గస్తీ నిర్వహించారు. రెండు దర్యాప్తు బృందాలు........... లాల్బాగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్ల ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బోయివాడ పోలీసులు ఇప్పటికి 15 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్‌లను, ఫొటోలను, వీడియో క్లిప్పింగులను పరిశీలిస్తున్నట్లు రాకేశ్ మారియా చెప్పారు. రాళ్లు రువ్విన ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇందులో ఒకరు ఇంకా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఎవరబ్బ సొత్తూ కాదు
సాక్షి, బెంగళూరు : ‘నేనెప్పుడు మంత్రి పదవిలోనే ఉంటానని అనడానికి ఆ పదవి ఎవరబ్బ సొత్తూ కాదు. మంత్రి పదవి నుంచి నన్ను తొలగిస్తే నేరుగా హెలికాఫ్టర్ ఎక్కి దావణగెరె వెళ్లిపోతాను. అక్కడ నా సొంత ఇంటిలో మిగతా జీవితాన్ని గడిపేస్తాను’ అని రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్ప వ్యాఖ్యానించారు. లాల్‌బాగ్‌లో ఏర్పాటైన మామిడి, పనస మేళాను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు శామనూరు ఇలా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సరైన ఫలితాలను సాధించలేకపోవడానికి మోడీ హవానే కారణమని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే దావణగెరె పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ఓటమి పాలైందని విశ్లేషించారు. లోక్‌సభ ఎన్నికల ఓటమికి బాధ్యులను చేస్తూ మంత్రులను తొలగించాల్సి వస్తే చాలా మందిని తొలగించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రి వర్గంలో మార్పులపై తనకెలాంటి సమాచారం లేదని, ఇదంతా కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న విజయాలను సాధించడంలో వెనకబడింది. దీంతో ఆయా పార్లమెంటు స్థానాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించిన మంత్రులపై వేటు వేసే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శామనూరు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.