ఘనంగా నాడ ప్రభు జయంతి | Nada celebrated the centenary | Sakshi
Sakshi News home page

ఘనంగా నాడ ప్రభు జయంతి

Published Sun, Apr 5 2015 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

Nada celebrated the centenary

బెంగళూరు(బనశంకరి) : నాడప్రభు కెంపేగౌడ జయంతి సంబరాలను శనివారం ఉదయం బృ హత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీ ఎంపీ) కార్యాలయం ముందు ఉన్న కెంపేగౌడ విగ్రహానికి మాలార్పణ చేయడం ద్వారా మేయర్ శాంతకుమారి ప్రారంభించారు. ప్రతి ఏటా కరగ మూడవరోజున కెంపేగౌడ జయంతిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

మేక్రిసర్కిల్, సుంకేనహళ్లి, కోరమంగళ, లాల్‌బాగ్‌లో ఉన్న నాలుగు దిక్కుల సరిహద్దు గోపురాలకు ఆయా ప్రాంతాల స్థానిక కార్పొరేటర్లు నేతృత్వంలో కెంపేగౌడ జ్యోతిని తీసుకువచ్చి కేంద్ర కార్యాలయానికి చేరుకోగా మేయర్ శాంతకుమారి జ్యోతిని స్వీకరించారు. కెంపేగౌడ జ్యోతిని వివిధ జానపద కళాబృందాలతో నాటి వైభవాన్ని చాటుతూ నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీబీఎంపీ కేంద్ర కార్యాలయ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement