పగటిపూట.. 7 గంటలు
పస్తుతం వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్ అంటూ కేవలం 2-3 గంటలు మాత్రమే వస్తోందని పార్టీ విమర్శించింది. అది కూడా రాత్రి సమయాల్లో వస్తుండటంతో పొలాలకు వెళ్లిన రైతులు పాముకాటుకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రైతులకు పగటి పూట కచ్చితంగా 7 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీనిచ్చింది.
తేకాకుండా 2019 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా... ప్రతి పల్లెకు కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రకటించింది. నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది.