సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కమిషన్ చైర్మన్ మదన్ బీ లోకూర్ ఎప్పుడు పని చేశారో తమకు తెలియదని.. విచారణ చేయకుండా నివేదిక ఎలా ఇస్తారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ కమిషన్ విచారణ పూర్తి చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పిందని.. తమ వివరణ ఛైర్మన్ తీసుకోలేదన్నారు.
కమిషన్ వేస్తున్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. కమిషన్ విచారణ పూర్తి అయితే అసెంబ్లీలో వివరాలు బయట పెట్టాలి. కేసీఆర్ ముందు చిల్లర వేషాలు వేయలేరు. మమ్మల్ని జైల్లో వేసే ఆలోచన వస్తే ఆలస్యం ఎందుకు?. మమ్మల్ని జైల్లో పెట్టడానికి భయపడుతున్నారా?’’ అంటూ జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ప్రజల ముందు పెట్టు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చినందుకు జైల్లో పెడతారా? నివేదికలో ఏమీ ఉండదని ముందే లీకులు ఇస్తున్నారు’’ అని జగదీష్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment