
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.
నల్లగొండలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ కిషోర్, కంచర్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం. ఈనెల 29న దీక్షా దివాస్‌ను అందరూ ఘనంగా జరుపుకోవాలి. కేసీఆర్ ఎన్నో పథకాలను తెచ్చారు. ప్రజలకు మంచి పాలన అందించారు. ఎంతో సంక్షేమం అందించారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన మహానుభావుడు కేసీఆర్’ అని చెప్పుకొచ్చారు.