
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇదే సమయంలో మంత్రుల వెనుక సీఎం రేవంత్ ఉండి ఇలా వారితో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు విఫలమై హైడ్రా.. అలాగే, హైడ్రా విఫలమై సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థాయిలేని వారికి మంత్రి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎవరో ఆకతాయిలు సోషల్ మీడియాలో చేసిన పనులకు కేటీఆర్‌కు ఏం సంబంధం ఉంది?. రేవంత్ వెనకుండి మంత్రులతో ఇలా మాట్లాడిస్తున్నారు. కొండా సురేఖ మాటలు సొంత పార్టీ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయి. హామీల అమలులో విఫలమై కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. హామీలు విఫలమై హైడ్రాను ముందుకు తెచ్చారు. హైడ్రా కూడా విఫలం కావడంతో సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారు.
రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. కేసీఆర్ కనపడటం లేదంటే కొండా మురళీ కనపడటంలేదని కొందరు మీమ్స్ పెడుతున్నారు. మనుషులను మాయం చేసే చరిత్ర మీది. చిల్లర మాటలు అనడం, అనిపించుకోవడం ఎందుకు. మంత్రి కోమటిరెడ్డి మానసిక స్థితి కూడా సరిగా లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో మూసీ పరిస్థితిపై కోమటిరెడ్డి చర్చకు సిద్ధమా?. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనే. మూసీ ప్రక్షాళన కాదు సీఎం, మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలి. మూసీ మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనల సుందరీకరణ జరగాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: మూసీకి కాసులు.. రైతులకు పైసల్లేవా?: రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment